పుష్ప అనగానే కళ్ళముందు అందరికీ బ్లింక్ అయ్యే ఒకే ఒక్క ఫేస్ పుష్పరాజ్.  బన్నీని అస్సలు గుర్తు తెచ్చుకోరు. పుష్పరాజ్ మానియా పుష్పరాజ్ క్యారెక్టర్ ఎక్కువగా అందరికీ గుర్తొస్తుంది . ఆ భుజం పైకి వెళ్లడం .. మాస్ గడ్డం.. నోట్లో కిల్లి రఫ్ లుక్..ఆయన భార్య శ్రీవల్లి ఇలాంటివే గుర్తొస్తూ ఉంటాయి. మరి ముఖ్యంగా పుష్ప2 చూసిన తర్వాత పెళ్ళాం మాట వినాలి మొగుడు అనే విషయం ఎక్కువగా చర్చించుకున్నారు జనాలు . ఒక సీఎంతో ఫోటో కోసం పుష్ప2 సినిమాను నడిపిన క్యారెక్టర్ పుష్ప రాజ్ ది . ఇది ఎప్పటికీ మర్చిపోలేరు  జనాలు.


పుష్ప సినిమా అల్లు అర్జున్ కి  ఎంత ప్ల చేసిందో అంతే మైనస్ కూడా చేసింది . అవన్నీ పక్కన పెడితే పుష్ప3 ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ బన్నీ అభిమానులతో పాటు జనాలు కూడా ఎంతో ఎంతో ఈగర్ గా వెయిట్ చేశారు.  అయితే పుష్ప3 మరో మూడేళ్ల తర్వాత రాబోతుంది అంటూ క్లారిటీకి వచ్చేసింది . ఎందుకు మూడేళ్లు గ్యాప్ తీసుకున్నాడు సుకుమార్ ..ఇప్పుడు రామ్ చరణ్ తో ఒక సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు . ఆ సినిమా కోసం ఆలస్యం చేశాడా..? అని కొంతమంది జనాలు మాట్లాడుకుంటూ ఉంటే . కాదు కాదు మూడేళ్ల తర్వాత పుష్ప3 సినిమాను ఓకే చేయడానికి కారణం అప్పటికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగిపోతారు.



ఆ తర్వాత టిఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుంది. ఆ కారణంగానే అప్పుడు పుష్ప 3 కి ఎటువంటి అడ్డంకులు ఉండవు అనే కాన్సెప్ట్ తో ముందు చూపుతో ఆలోచించి సుకుమార్ ఈ నిర్ణయం తీసుకున్నారు అంటున్నారు జనాలు . అంతేకాదు ఒక బిగ్ బడా పొలిటికల్ లీడర్ కూడా పుష్ప3 వెనక ఉన్నాడు అని .. పుష్ప3లో పొలిటికల్ నేపథ్యంలో ఉండే పాయింట్స్ కూడా టచ్ చేయబోతున్నాడు  సుకుమార్ అంటూ టాక్ వినిపిస్తుంది . ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజ్ లో "దమ్ముంటే పట్టుకోరా షికావత్" అనే సాంగ్ ని రీమేక్ చేసి మరి తమదైన వర్షెన్ లో ఎవరికి తగల వాళ్ళకి తగిలే విధంగా చేస్తున్నారు బన్నీ అభిమానులు..!

మరింత సమాచారం తెలుసుకోండి: