చిత్ర పరిశ్రమ లో కొన్ని సినిమాల కు ఊహించకుండా భలే కలిసి వస్తూ ఉంటుంది .. అయితే ఇప్పుడు ఇలానే నందమూరి హీరో కళ్యాణ్ రామ్ సినిమా కు మంచి డిమాండ్ ఏర్పడింది .. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం లో కళ్యాణ్ రామ్ హీరోగా లేడీ  సూపర్ స్టార్ విజయశాంతి కీలక పాత్ర లో నటిస్తున్న సినిమా అర్జున్ సన్నాఫ్ వైజయంతి .. గత సంవత్సరం కాలంగా షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా గురించి మొన్న‌టివరకు ఎక్కడ పెద్దగా ఎలాంటి చర్చ జరగలేదు .
 

కానీ ఎప్పుడైతే ఈ సినిమా టీజర్ రిలీజ్ అయిందో అప్పటి నుంచి బిజినెస్ సర్కిల్స్ లో ఈ సినిమా గురించి గట్టి చర్చ జరుగుతూ వస్తుంది . ఎవరికి తెలిసిన సర్కిల్స్ లో వారు ఈ సినిమా ఇన్ సైడ్ టాక్ ఏంటనే దానిపై ఆరాలు తీయటం మొదలుపెట్టారు .. అవుట్ టౌన్ డౌట్ పక్క కమర్షియల్ సినిమా గా వస్తున్నా అర్జున్ సన్నాఫ్ వైజ‌యంతి కళ్యాణ్రామ్ కు మరో భారీ హిట్ అవుతుందని తెలియడంతో మేకర్స్ కు మంచి ఆఫర్స్ వస్తున్నాయి ..

 

కేవలం ఆంధ్ర థియేట్రికల్ రైట్స్‌ తోనే ఈ సినిమా 12 కోట్లకు అటు ఇటుగా అమ్ముడైపోయింది .. అటు రాయలసీమ ఏరియా అయినా సీడెడ్ వరకు 3.6 కోట్లకు రాముడు కంపెనీ నాన్ రిటన్ అడ్వాన్స్ కింద ఫిక్సయింది .. ఈ రేట్ కళ్యాణ్రామ్ కెరీర్ లోని హైయెస్ట్ .. కేవలం ఒక్క టీజర్ తోనే ఈ సినిమాకు ఇంతటి భారీ డిమాండ్ వచ్చింది .. కళ్యాణ్ రామ్ కెరియర్లు 21వ సినిమాగా వస్తున్న ఈ సినిమా ని ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణ లో అశోక్ క్రియేషన్స్ అశోక్ వర్ధ ముప్ప మరియు సునీల్ బలుసు నిర్మించారు .. వచ్చే ఏప్రిల్ లేదా మేలో సమ్మర్ కనకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది .

మరింత సమాచారం తెలుసుకోండి: