- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ స్టార్ లైనప్‌ లో భారీ అంచనాలు ఉన్న సినిమా లు చాలానే ఉన్నాయి. ముందుగా మారుతి ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌భాస్ న‌టిస్తోన్న ది రాజాసాబ్ సినిమా థియేట‌ర్ల లోకి రానుంది. ఆ సినిమా త‌ర్వాత ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం లో స‌లార్ 2 .. ఆ త‌ర్వాత నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వం లో క‌ల్కి 2 సినిమా లు లైన్లో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇక ఈ కోవ‌లోనే ప్ర‌భాస్ నుంచి స్పిరిట్ సినిమా కూడా లైన్లో ఉన్న సంగ‌తి తెలిసిందే. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఓ పవర్‌ ఫుల్ కాప్ స్టోరీగా రాబోతుంద‌ని కూడా ఇప్ప‌టికే డైరెక్ట‌ర్ క్లారిటీ ఇచ్చేశాడు. ఈ సినిమా లో ఇక బాలీవుడ్ హీరో కూడా ఉండ‌నున్నాడు. ఈ వార్తే ఫ్యాన్స్ ను మెస్మ‌రైజ్ చేస్తుంద‌ని అంటున్నారు.


ఈ వార్త‌కు తోడుగా స్పిరిట్ సినిమా లో మరో సౌత్ స్టార్ హీరో ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడని తెలుస్తోంది. సెకండ్ హాఫ్ లో వచ్చే ఈ పాత్ర సినిమాలోనే చాలా ముఖ్యమైన పాత్ర అంటున్నారు. పైగా ఈ పాత్ర క‌థ‌కు అనుగుణంగా వ‌చ్చే పాత్ర అని .. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ సినిమా లో లేని విధంగా .. చాలా కొత్తగా ఉంటుందని తెలుస్తోంది. మరి ఈ పాత్ర కోసం సందీప్ రెడ్డి వంగా ఎవర్ని అప్రోచ్ అవుతాడో అన్న‌ది కూడా ఇప్పుడు బిగ్ స‌స్పెన్స్ గా ఉంది.


ఇక స్పిరిట్ సినిమా గురించి ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగా ఇప్ప‌టికే మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ తో మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా స్టార్ట్ చేశాడు. ఇక ప్రభాస్ తో చేసిన సినిమాలకు విజిల్ సౌండ్ సెంటిమెంట్ అని, ,దాన్ని కొనసాగిస్తానని హర్షవర్ధన్ రామేశ్వర్ కూడా ఇప్ప‌టికే క్లారిటీ ఇచ్చాడు. ఇక ఈ సినిమాను భద్రకాళి పిక్చర్స్ భారీ స్థాయిలో నిర్మించనుంది. ఇక ‘స్పిరిట్‌’ మెయిన్ కథాంశమే చాలా కొత్తగా ఉంటుందన్న ప్ర‌చారంతో అంచ‌నాలు మామూలుగా లేవు.

మరింత సమాచారం తెలుసుకోండి: