
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అటు రాజకీయాల తో పాటు ఇటు సినిమా లోనూ పుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. పవన్ అటు ఆంధ్రప్రదేశ్ కేబినెట్లో ఉప ముఖ్యమంత్రి గాను .. రెండు కీలక శాఖలకు మంత్రి గాను ఉన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే పవన్ ఇప్పటికే రెండు సినిమాలు పూర్తి చేయాల్సి ఉన్న సంగతి తెలిసిందే. హరిహర వీరమల్లు , OG సినిమా ల షూటింగ్ ఆయన ముగించాల్సి ఉంది. ఈ రెండు సినిమా లలో వీరమల్లు షూటింగ్ చాలా వరకు పూర్తయ్యింది. మార్చి 28న ముందుగా రిలీజ్ అనుకున్నారు. ఇప్పుడు పవన్ బిజీ షెడ్యూల్ వల్ల మే కు వాయిదా పడిపోయింది.
వీరమల్లు తర్వాత ఓజీ కూడా చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకుంది. ఓజి సినిమా బ్యాలెన్స్ షూటింగ్ పూర్తి చేసి మిగిలిన ప్యాచ్ వర్క్ కంప్లీట్ చేసి దసరాకు రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక పవన్ రాజకీయంగా ఫుల్ బిజీగా ఉండడంతో ఈ సినిమా లు పూర్తి కాక అందరూ ఇబ్బంది పడుతున్నారు. ఈ రెండు సినిమాల తో పాటు పవన్ నటిస్తోన్న మరో సినిమా ఉస్తాద్ భగత్‌సింగ్. హరీష్ శంకర్ దర్శకత్వం లో మైత్రీ వాళ్లు నిర్మించే ఈ సినిమా వాస్తవానికి ఎప్పుడో సెట్స్ మీదకు వెళ్లాల్సి ఉంది. ఇప్పటకీ సెట్స్ మీదకు వెళ్లలేదు. అసలు ఎప్పుడు ? వెళుతుందో ? తెలియని పరిస్థితి.
ఇదిలా ఉంటే పవన్ నటించే మరో ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది. దర్శకుడు సురేందర్ రెడ్డి తో పవన్ ఓ సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఏజెంట్ ప్లాప్ తర్వాత సురేందర్ రెడ్డి - పవన్ కాంబినేషన్ అంటేనే అందరూ షాక్ అయ్యారు. SRT ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ తాళ్లూరి ఈ సినిమాను నిర్మిస్తున్నట్టు అనౌన్స్ చేశారు. కానీ, పవన్ పొలిటికల్ గా మరింత బిజీ కావడం తో ఈ సినిమాలో తాను నటించనని పవన్ క్లారిటీ ఇచ్చేశారట. అలా ఈ ప్రాజెక్టు క్యాన్సిల్ అయ్యింది.