ఇప్పటివరకు ఎన్నో భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించి నటిగా తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపు ఏర్పరచుకున్న వారిలో పూజా హెగ్డే ఒకరు. ఈ బ్యూటీ కొన్ని సంవత్సరాల క్రితం నాగ చైతన్య హీరోగా రూపొందిన ఒక లైలా కోసం అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ మంచి విజయం సాధించడం , ఇందులో పూజ హెగ్డే తన అందాలతో , నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ మూవీ ద్వారా ఈ బ్యూటీ కి తెలుగు సినీ పరిశ్రమలు ఒక మంచి గుర్తింపు వచ్చింది.

ఆ తర్వాత ఈమెకు టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల్లో వరసగా అవకాశాలు రావడం , అందులో కొన్ని సినిమాలు మంచి విజయాలు సాధిస్తూ వెళ్లడంతో తెలుగులో ఈ బ్యూటీ క్రేజీ భారీగా పెరిగిపోయింది. ఇకపోతే ఈ మధ్య కాలంలో ఈమె ఏ తెలుగు సినిమాల్లో నటించలేదు. ఈమె నటించిన తెలుగు సినిమా విడుదల అయ్యి కూడా ఇప్పటికే చాలా కాలం అవుతుంది. ప్రస్తుతం కూడా ఈ బ్యూటీ చేతిలో ఏ తెలుగు సినిమాలు లేవు. ప్రస్తుతం పూజ హెగ్డే వరుసగా తెలుగు , హిందీ సినిమాల్లో నటిస్తూ వస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా పూజ హెగ్డే ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో భాగంగా తనపై కొంత మంది కావాల్సి కొని నెగిటివ్ ప్రచారం చేశారు అని చెప్పుకొచ్చింది. తాజా ఇంటర్వ్యూ లో బాగంగా పూజ హెగ్డే మాట్లాడుతూ ... కొన్ని మీమ్ పేజెస్ వరుసగా నన్ను తిడుతూ పోస్టులు పెట్టాయి.

నా గురించి కంటిన్యూగా ఎందుకు వారు తిడుతున్నారు అని అనుకున్నాను. ఆతర్వాత నాకు తెలిసింది. నన్ను కావాలని టార్గెట్ చేసి నన్ను కిందకు లాగడానికి కొందరు ఈ రకంగా డబ్బు ఖర్చు కూడా చేస్తున్నారని. ఆ సమయంలో వారు చేసిన పనికి నాతో పాటు నా ఫ్యామిలీ కూడా బాధపడింది. నన్ను కిందికి లాగడం కోసం మరీ ఇంతకు దిగజారతారా ... అని అనిపించింది. ఎదుగుదలను చూసి ఓర్వలేక కొంత మంది పని కట్టుకొని మరి నాపై ట్రోలింగ్ చేయించారు అని పూజా హెగ్డే చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: