టాలీవుడ్ మాస్ డైరెక్టర్ కొరటాల శివ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘దేవర’.. గతేడాది సెప్టెంబర్ 27 న రిలీజైన ఈ బిగ్గెస్ట్ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది.. ఈ సినిమాకు మొదట నెగటివ్ టాక్ వచ్చినా ఎన్టీఆర్ కి వున్న క్రేజ్ కారణంగా దేవర మూవీ వరల్డ్ వైడ్ గా రూ.500 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమాతో ఎన్టీఆర్ పాన్ ఇండియా వైడ్ అలాగే ఓవర్సీస్ లో సైతం అదరగొట్టాడు.. దేవర సినిమా ఓటీటీలో కూడా అదరగొట్టింది..నెక్ట్స్ లెవెల్ వ్యూస్ తో ఎన్టీఆర్ దేవర ఓటీటీలో దూసుకెళ్లింది. బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటించాడు.

యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన దేవర ఇప్పుడు జపాన్ రిలీజ్ కు సిద్ధం అవుతుంది..మార్చి 28న దేవర మూవీ జపాన్ థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే ఇప్పటికే ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి.తాజాగా దేవర ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు అక్కడి ప్రేక్షకులతో కలిసి 'దేవర' చూసేందుకు స్వయంగా ఎన్టీఆర్ భార్య ప్రణతీతో కలిసి జపాన్ వెళ్లాడు.ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఎన్టీఆర్ ప్రస్తుతం కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో బిగ్గెస్ట్ మూవీ చేస్తున్నాడు. రీసెంట్ గా ఆ మూవీ గ్రాండ్ గా మొదలయింది..మరోవైపు బాలీవుడ్ లో 'వార్ 2' సినిమాలో కూడా ఎన్టీఆర్ నటిస్తున్నాడు.. వార్ 2 సినిమా ఈ ఏడాది ఆగస్టు 14న గ్రాండ్ గా థియేటర్లలోకి రానుంది...ప్రశాంత్ నీల్ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలనీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు..



మరింత సమాచారం తెలుసుకోండి: