టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన హీరోలలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒకరు. ఈయన ఇప్పటి వరకు ఎన్నో సినిమాలలో నటించి ఎన్నో విజయాలను అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన దర్శకులలో సుకుమార్ ఒకరు. ఈయన ఇప్పటి వరకు ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలకు దర్శకత్వం వహించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ డైరెక్టర్లలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే కొన్ని సంవత్సరాల క్రితం రామ్ చరణ్ , సుకుమార్ కాంబినేషన్లో రంగస్థలం అనే మూవీ వచ్చింది.

సినిమా భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. చరణ్ , సుకుమార్ కాంబోలో మరో మూవీ కూడా రూపొందబోతున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. ఈ మూవీ ని RC 17 అనే వర్కింగ్ టైటిల్ తో అధికారికంగా ప్రకటించారు. ఇంతకాలం పాటు పుష్ప 2 సినిమా పనుల్లో బిజీగా ఉన్న సుకుమార్ ప్రస్తుతం ఖాళీగా ఉన్నాడు. ఇక చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. చరణ్ , బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాను కంప్లీట్ చేసుకోగానే చరణ్ , సుకుమార్ కాంబో మూవీ స్టార్ట్ అవుతుంది అని వార్తలు వచ్చాయి.

ఇకపోతే సుకుమార్ బాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి షారుక్ ఖాన్ తో మూవీ ప్లాన్ చేస్తున్నాడు అని , ఆ మూవీ మరికొన్ని రోజుల్లోనే స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అని ఓ వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇక ఈ వార్తకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కాకపోతే షారుక్ , సుకుమార్ కాంబోలో మూవీ రాబోతుంది అనే వార్తలు రావడంతో చరణ్ ఫాన్స్ కాస్త టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: