సినిమా ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న రెండు సినిమాలు ఒకే రోజు విడుదల కావడం అనేది చాలా తక్కువ సందర్భాలలో జరుగుతూ ఉంటుంది. అలా జరగడానికి ప్రధాన కారణం భారీ క్రేజ్ ఉన్న రెండు సినిమాలు ఒకే.రోజు విడుదల కావడం వల్ల రెండు సినిమాలకు ఎంతో కొంత నష్టం జరిగే అవకాశం ఉంటుంది. దానితో నిర్మాత లు చాలా తక్కువ సందర్భాలలో మినహాయిస్తే భారీ క్రేజ్ ఉన్న సినిమాల విడుదల తేదీల మధ్య కనీసం ఒక వారం గ్యాప్ ఉండేలా చూసుకుంటూ ఉంటారు. దాని వల్ల సినిమా ఓపెనింగ్స్ కి పెద్దగా ప్రాబ్లం ఉండదు.

ఇకపోతే వచ్చే సంవత్సరం సమ్మర్ లో భారీ క్రేజ్ ఉన్న రెండు సినిమాలు ఒకే రోజు విడుదల అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. అసలు విషయం లోకి వెళితే ... ప్రస్తుతం నాచురల్ స్టార్ నాని ది పారడైజ్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను మార్చి 26 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , బుచ్చిబాబు సనా దర్శకత్వంలో RC 16 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని కూడా మార్చి 26 వ తేదీన విడుదల చేయాలి అని ఆలోచనలో ఈ మూవీ బృందం వారు ఉన్నట్లు అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా మరికొన్ని రోజుల్లో విడుదల చేయనున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.

ఒక వేళ ది ప్యారడైజ్ , RC 16 మూవీలు కనుక ఒకే రోజు విడుదల అయినట్లయితే ఈ రెండు సినిమాల మధ్య బాక్సా ఫీస్ వరకు గట్టిగా జరిగే అవకాశాలు చాలా వరకు ఉంటాయి. ఇకపోతే శ్రీకాంత్ ఓదెల తన తదుపరు మూవీ ని మెగాస్టార్ చిరంజీవితో చేయబోతున్నాడు. ఇప్పటికే ఆ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఈ మూవీ ని నాని నిర్మించబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: