ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అదిరిపోయే రేంజ్ విజయం సాధించిన పుష్ప మూవీ తర్వాత ఏ దర్శకుడితో సినిమా చేస్తాడా అనే ఆసక్తి ఆయన అభిమానులతో పాటు చాలా మంది ప్రేక్షకుల్లో కూడా నెలకొంది. అలాంటి సమయం లోనే బన్నీ తన తదుపరి మూవీ ని త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయబోతున్నాడు అనే వార్తలు వచ్చాయి. దానితో చాలా మంది బన్నీ తన తదుపరి మూవీ ని త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కన్ఫామ్ చేసుకున్నాడు అనే ఆలోచనకు వచ్చేసారు.

ఇక అలాంటి సమయం లోనే బన్నీ తన తదుపరి మూవీ ని అట్లీతో చేయబోతున్నట్లు ఈ మధ్య కాలంలో వార్తలు బలంగా వస్తున్నాయి. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం బన్నీ తన తదుపరి మూవీ ని అట్లీ తో చేయబోతున్నట్లు , అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరికొన్ని రోజుల్లోనే రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే అట్లీ తో చేయబోయే సినిమా కోసం అల్లు అర్జున్ తన కెరియర్ లో ఇప్పటి వరకు తీసుకొని నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... బన్నీ , అట్లీ దర్శకత్వంలో చేయబోయే సినిమాలో డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు అల్లు అర్జున్ చాలా సినిమాల్లో నటించిన కూడా ఏ మూవీ లో కూడా రెండు పాత్రల్లో నటించలేదు.

అట్లీ సినిమా కోసం ఈయన మొదటి సారి తన కెరీర్లో రెండు పాత్రలలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే అట్లీ దర్శకత్వంలో రూపొందిన చాలా సినిమాల్లో హీరో పాత్రలు డ్యూయల్ రోల్ లో కనిపించిన సందర్భాలు ఉన్నాయి. ఇకపోతే అల్లు అర్జున్ హీరోగా రూపొందనున్న మూవీ కావడం , ఆ సినిమాకు అట్లీ దర్శకత్వం వహించనున్నట్లు వార్తలు రావడంతో ఈ క్రేజీ కాంబోలో నిజం గానే మూవీ సెట్ అయితే ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొనే అవకాశాలు ఉన్నాయి అని చాలా మంది ప్రేక్షకులు అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: