టాలీవుడ్ యువ నటుడు నితిన్ , టాలెంటెడ్ డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ కాంబినేషన్లో కొన్ని సంవత్సరాల క్రితం ఇష్క్ అనే లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణి నిత్య మీనన్ హీరోయిన్ గా నటించగా ... అనుప్ రూబెన్స్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ సినిమా కంటే ముందు నితిన్ నటించిన చాలా సినిమాలు వరుసగా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టడం , విక్రమ్ కే కుమార్ అంతకు ముందు భారీ సినిమాలు అవి కూడా తీసి ఉండకపోవడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు పెద్దగా అంచనాలు పెట్టుకోలేదు.

అలా పెద్దగా అంచనాలు లేకుండా విడుదల అయిన ఈ సినిమాకు విడుదల అయిన తర్వాత ప్రేక్షకుల నుండి అద్భుతమైన బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. దానితో ఈ సినిమా అదిరిపోయే రేంజ్ కలెక్షన్లను వసూలు చేసి భారీ విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే ఇష్క్ మూవీ ద్వారా నితిన్ , నిత్యా మీనన్ , అనుప్ రూబెన్స్ , విక్రమ్ కే కుమార్ కి అద్భుతమైన గుర్తింపు తెలుగు సినీ పరిశ్రమలో వచ్చింది. ఇకపోతే ఇష్క్ మూవీ విడుదల అయిన చాలా సంవత్సరాల తర్వాత నితిన్ , విక్రమ్ కె కుమార్ కాంబోలో మరో మూవీ రూపొందబోతున్నట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికే విక్రమ్ , నితిన్ కి ఓ కథను వినిపించగా అది అద్భుతంగా నచ్చడంతో విక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయడానికి నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ క్రేజీ కాంబోలో తెరకెక్కబోయే మూవీ ని యువి క్రియేషన్స్ బ్యానర్ వారు నిర్మించ బోతున్నట్లు తెలుస్తోంది. ఈ కాంబో మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరికొన్ని రోజుల్లోనే వెలువడబోతున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: