సినిమా ఇండస్ట్రీలో కెరియర్ను ప్రారంభించిన కొత్తలో మంచి విజయాలు దక్కిన హీరోయిన్లకు అద్భుతమైన క్రేజ్ వస్తూ ఉంటుంది. అలాగే సూపర్ సాలిడ్ క్రేజ్ ఉన్న హీరోయిన్స్ ఎక్కువ శాతం కెరియర్ ప్రారంభంలో స్పెషల్ సాంగ్స్ చేయడానికి ఇష్టం చూపరు. కానీ టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే అద్భుతమైన విజయాన్ని అందుకొని మంచి గుర్తింపును సంపాదించుకున్న ఓ ముద్దుగుమ్మ తాజాగా ఓ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది.

మరి టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకొని తాజాగా స్పెషల్ సాంగ్ చేసిన ఆ బ్యూటీ ఎవరు అనుకుంటున్నారా ..? ఆమె మరెవరో కాదు మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణి అయినటువంటి రెబా మోనికా జాన్‌. ఈ నటి శ్రీ విష్ణు హీరో గా రూపొందిన సమజవరగమన సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ తోనే ఈ బ్యూటీ టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇక ఈ మూవీ లో ఈ నటి తన అందాలతో , నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. నటించిన మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకోవడం , అలాగే ఈ మూవీ లో ఈ నటి తన నటనతో , అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈమెకు వరస పెట్టి తెలుగులో క్రేజీ సినిమాలో అవకాశాలు వస్తాయి అని చాలా మంది అనుకున్నారు.

కానీ ఈమెకు సమజవరగమన మూవీ తర్వాత భారీ స్థాయిలో క్రేజ్ ఉన్న సినిమాల్లో అవకాశాలు రాలేదు. ఇకపోతే మార్చి 28 వ తేదీన విడుదల కావడానికి రెడీ అయిన మ్యాడ్ స్క్వేర్ మూవీ లో ఈ బ్యూటీ స్పెషల్ సాంగ్ చేసింది. ఇప్పటికే ఈ స్పెషల్ సాంగ్ కి సంబంధించిన లిరికల్ వీడియోను కూడా ఈ మూవీ బృందం వారు విడుదల చేయగా దానికి అద్భుతమైన రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇలా కెరియర్ ప్రారంభంలోనే ఈ నటి స్పెషల్ సాంగ్లో నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: