ఇక ఈ నెలలో  వచ్చి 27న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు .. ఇప్పుడు ఈ క్రమంలోనే చరణ్ పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమాకు సంబంధించిన గ్లింప్స్ ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతుంది .. బుచ్చిబాబు సానా , రామ్ చరణ్ కాంబోలో ఓ సినిమా  తెరకెక్కుతున్న విషయం తెలిసిందే .. ఇక ఈ సినిమా కు సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా ఇప్పటివరకు రిలీజ్ చేయలేదు .. అయితే ఇప్పుడు రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా సినిమా నుంచి గ్లింప్స్ ని రిలీజ్ చేసి లుక్ ని కూడా రివిల్ చేయాలని భావిస్తున్నారు ..
 

అయితే ఇప్పటికే ఈ గ్లింస్ కు సంబంధించిన వీడియో కట్‌ కూడా కంప్లీట్ అయింది .. ఇప్పటికే ఎడిట్ అయిన వెర్ష‌న్ న్ని కొంతమంది చూశారు  చూసిన వాళ్లంతా మరో లెవెల్ లో ఉందంటూ పొగడ్తలు వర్షం కురిపిస్తున్నారు .. ఇక ఈ గ్లింప్స్  మామూలుగా లేదని చరణ్ అభిమానుల ఊహకు  అంధాన్ని రేంజ్ లో గ్లింప్స్  కట్ చేశారని కూడా తెలిసింది . ఇక చరణ్ పుట్టినరోజు కి హైదరాబాదులో ఉండటం లేదట .. ఫ్యామిలీ తో కలిసి టూర్ కు వెళుతున్నట్టు తెలుస్తుంది .. గేమ్ చేంజర్‌ తర్వాత చరణ్ నుంచి వస్తున్న సినిమా ఇదే ..



గేమ్ చేంజర్ తో చరణ్ భారీ విమర్శలు కూడా ఎదుర్కొన్నాడు .. ఆ సినిమా అభిమానులను బాగా నిరశపరిచింది .  అలాగే వాళ్ళందరికీ సమాధానం చెప్పేలా బుచ్చిబాబు ఈ గ్లింప్స్  ను భారీగా డిజైన్ చేశారట .. ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే.. జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది .. స్పోర్ట్స్  నేపథ్యంలో వచ్చే ఈ పీరియాడిక్ డ్రామా మూవీ.. అలాగే ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు .  అలాగే స్టార్ క్రికెటర్ ఎంఎస్ ధోని కూడా గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నారని టాక్ కూడా నడుస్తుంది .

మరింత సమాచారం తెలుసుకోండి: