
టాలీవుడ్ యంగ్ టైగర్ ... మ్యాన్ ఆఫ్ మాసెస్ జూ.ఎన్టీఆర్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. ఎన్టీఆర్ కు 2015 నుంచి సినిమాల పరంగా మహార్దశ పట్టిందనే చెప్పాలి. పూరి జగన్నాథ్ దర్శకత్వం లో వచ్చిన టెంపర్ సినిమా నుంచి ఎన్టీఆర్ కు తిరుగు లేకుండా పోయింది. ఆ సినిమా నుంచి ఎన్టీఆర్ వరుస సూపర్ డూపర్ హిట్ సినిమా లతో దూసుకు పోతున్నాడు. వరుసగా టెంపర్ - నాన్న కు ప్రేమతో - జై లవకుశ - జనతా గ్యారేజ్ - అరవింద సమేత వీరరాఘవ - త్రిబుల్ ఆర్ - దేవర అన్నీ సినిమాలు సూపర్ హిట్లే. ఇక గతేడాది కొరటాల శివ దర్శకత్వం లో ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ లో షేక్ అయ్యింది.
ఇక ఇప్పుడు ఎన్టీఆర్ వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. ఇప్పటికే బాలీవుడ్ ప్రెస్టీజియస్ యాక్షన్ సీక్వెల్ సినిమా ‘ వార్-2 ’ లో ఎన్టీఆర్ నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇక దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ తన తర్వాత సినిమా ను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కూడా ఇటీవల ప్రారంభం అయింది. త్వరలో ఎన్టీఆర్ ఈ సినిమా షూటింగ్‌లో కూడా జాయిన్ అవుతాడు. తాజాగా ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ ఉన్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. మిడ్ నైట్ టైంలో ఎన్టీఆర్ - నీల్ ఇద్దరూ కలిసి ఉన్ ఫొటో ను లిఖిత రెడ్డి పోస్ట్ చేసింది. ఈ ఫొటో చూసిన నెటిజన్లు ఎన్టీఆర్ - నీల్ ఇద్దరూ సినిమా గురించి ఏం ముచ్చట్లు పెట్టారా ? అని కామెంట్ చేస్తున్నారు.