- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ ప్ర‌స్తుతం రెండు క్రేజీ ప్రాజెక్టు ల‌లో న‌టిస్తున్నారు. చిరు న‌టిస్తోన్న సినిమా ల‌లో ముందుగా వ‌చ్చే సినిమా చిరు హీరోగా ... త్రిష హీరోయిన్ గా యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న భారీ సినిమా “ విశ్వంభర ” . చిరు 1991లో న‌టించిన సోషియో ఫాంట‌సీ సినిమా జ‌గ‌దేక వీరుడు అతిలోక సుంద‌రి లాంటి బ్లాక్ బస్ట‌ర్ త‌ర్వాత మ‌ళ్లీ ఇన్నేళ్ల కు చిరు విశ్వంభ‌ర సినిమా తో సోషియో ఫాంట‌సీ సినిమా చేస్తున్నాడు. ఇక విశ్వంభ‌ర త‌ర్వాత చిరు మరిన్ని సాలిడ్ ప్రాజెక్ట్ లు చిరంజీవి నుంచి ఉన్నాయి. విశ్వంభ‌ర సినిమా త‌ర్వాత చిరు నెక్ట్స్ లైన‌ప్ లో దర్శకుడు అనీల్ రావిపూడితో చేస్తున్న సాలిడ్ సినిమా కూడా ఒకటి ఉంది.


మరి మళ్ళీ చిరంజీవిని తన వింటేజ్ కామెడీ ట్రాక్ లో చూడాలి అనుకునేవారికి చిరు - అనిల్ రావిపూడి సినిమా గ‌ట్టి ట్రీట్ లా ఉండేలా అనిల్ రావిపూడి ప్లాన్ చేస్తున్నాడు. ఇక ఇప్పుడు అనిల్ - చిరు ప్రాజెక్టు పై లేటెస్ట్ బజ్ వినిపిస్తుంది. ఈ బ‌జ్‌ ప్రకారం ఈ రానున్న ఏప్రిల్ మొదటి వారం లోనే మేకర్స్ గ్రాండ్ సినిమాని ముహూర్త కార్యక్రమాలతో స్టార్ట్ చేసి సినిమా ను సెట్స్ మీద‌కు తీసుకు వెళ్ల‌నున్నారు. ఇక ఈ సినిమా సెట్స్ మీద‌కు వెళ్లిన‌ప్ప‌టి నుంచి ఫుల్ జోష్ లో .. ఫుల్ స్వింగ్ లో షూటింగ్ పూర్తి చేస్తార‌ట‌. కంటిన్యూ గా జ‌రిగే షెడ్యూల్లో సినిమా ను పూర్తి చేసి వ‌చ్చే సంక్రాంతికి రిలీజ్ చేసే ప్లానింగ్‌లో ఉన్నారు. ఈ సినిమా కు కూడా భీమ్స్ సంగీతం అందించనున్న సంగతి తెలిసిందే. అలాగే సాహు గారపాటి నిర్మాణం వహిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: