
అల్లు అర్జున్ కుటుంబ సభ్యులలో ఒకరు తీవ్ర అనారోగ్య పాలు కావడం చేత అల్లు అర్జున్ హాస్పిటల్ కి వెళ్ళినట్లుగా తెలుస్తోంది.. అల్లు అర్జున్ నాయనమ్మ కనకరత్నం ఈ రోజున తీవ్ర అస్వస్థకు గురైందట. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే ఒక ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లి మరి వైద్యం అందించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అల్లు అర్జున్ నాయనమ్మ ఆరోగ్యం పరిస్థితి విషయంగానే ఉందని వెంటిలేటర్ పైన ఉంచి మరి వైద్యం అందిస్తున్నట్లుగా వైద్యులు తెలియజేశారు. అయితే ఈమె వయసు ప్రస్తుతం 95 సంవత్సరాలట.
వృద్ధాప్య సమస్యల కారణంగా గత కొద్దిరోజుల నుంచి ఇమే వయోభారంతో ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం.. అల్లు అరవింద్ కు తల్లి మెగాస్టార్ చిరంజీవికి స్వయంగా అత్తగారు అవుతారట చిరంజీవి కుటుంబం కూడా మరికొన్ని గంటలలో ఆసుపత్రికి వెళ్లి మరి తన అత్త కనకరత్నం ను పరామర్శించే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయం పైన అటు అల్లు టీమ్ ఏ విధంగా క్లారిటీ ఇస్తుందో చూడాలి మరి. ఇటీవల అల్లు అర్జున్ కూడా ఒక ప్రముఖ దేవాలయాన్ని సందర్శించడానికి విదేశాలకు వెళ్లినట్లుగా కూడా ఫోటోలు వీడియోలు వైరల్ గా మారుతున్నాయి. మరి ఇలాంటి సమయంలో తన నాయనమ్మ హాస్పిటల్ లోకి చేర్చడంతో హుటాహుటిగా వచ్చేశారట.