తెలుగు సినీ పరిశ్రమ ఎప్పుడూ వైవిధ్యమైన కథలను ప్రోత్సహిస్తుంది. కానీ కొన్నిసార్లు, కొన్ని టాపిక్స్ గురించి మాట్లాడటం సాహసమే. అలాంటి ఓ కొత్త ప్రయోగమే 'పూర్ణ చంద్రరావు'. ఇండియన్ సినిమాలో తొలిసారి పోర్న్ అడిక్షన్ అనే డిఫరెంట్ కాన్సెప్ట్ ఎత్తిచూపిస్తూ వస్తున్న ఈ సినిమా తారక రామ దర్శకత్వంలో తెరకెక్కబోతుంది. ఈ సినిమా హీరో విజయ్ రాజ్ కుమార్ ‘ఏం చేస్తునావ్’ అనే సినిమా ఇదివరకే తీశారు. ఇప్పుడు 'పూర్ణ చంద్రరావు' లో  హీరో గా నటిస్తున్నారు. అంతే కాదు ఈ డిఫరెంట్ కాన్సెఫ్ట్‌ రాసిన రైటర్ కూడా ఈయనే.  విజ‌య్ రాజ్‌కుమార్‌ ఎలాంటి పాత్రలైనా మనసు పెట్టి చేయగలరు. అవకాశం వస్తే అదరగొట్టేస్తారు. ఈ డిఫ‌రెంట్ కాన్సెఫ్ట్ సినిమా అత‌డి  కెరీర్‌కి బెస్ట్‌గా నిలిచే సినిమా అనిపిస్తోంది. పోస్టర్ చూడగానే, ఏంటిది అనే సందేహంతో మొదలై, 'అరె.. ఆసక్తిగా ఉందే' అనుకుని, 'భలే సాహసంగా, ధైర్యంగా చేశాడే' అనిపిస్తోంది.

 
సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే, మామూలు సినిమా కాదని అర్థమవుతుంది. సోఫా మీద అర్ధనగ్నంగా కూర్చొని ల్యాప్‌టాప్ చూస్తున్న హీరో, వెనుక స్టీవ్ జాబ్స్, ఎలాన్ మస్క్ ఫోటోలు .. ఇవన్నీ కలిపి ప్రేక్షకులకు ఓ మెసేజ్ ఇస్తున్నాయి. టెక్నాలజీ, పోర్న్ అడిక్షన్, మానసిక స్థితి అన్నీ కలిపి ఓ డీప్ అర్ధం చెప్పేలా ఉంది. మామూలుగా మనం మద్యం, డ్రగ్స్, సోషల్ మీడియా అడిక్షన్ గురించి సినిమాలు చూస్తాం. కానీ పోర్న్ అడిక్షన్ గురించి ఓ ఫీచర్ ఫిల్మ్ రావడం ఇదే మొదటిసారి. 'పూర్ణ చంద్రరావు' ఈ టాపిక్ ను ఎంటర్టైన్మెంట్ & థాట్ప్రొవోకింగ్ స్టైల్ లో చూపించబోతుంది. 'అనగనగా ఆస్ట్రేలియా లో' సినిమాతో కొత్తగా ట్రై చేసిన తారక రామ, ఇప్పుడు మరింత బోల్డ్ కథనాన్ని ఎంచుకున్నారు. హీరో కూడా తన సొంత అనుభవాలను ఆధారంగా చేసుకుని ఈ కథ రాశాడట.!


సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అయినప్పటి నుంచి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. చాలామంది "ఇది చాలా మందికి అవసరమైన కథ" అని కామెంట్ చేస్తున్నారు. అలాగే, "టాలీవుడ్ లో ఇలాంటి ప్రయోగాలు చాలా అరుదు" అంటూ సినీ ప్రేమికులు ప్రశంసిస్తున్నారు. సహాన ఆర్ట్ క్రియేషన్స్ పై మాధవి మంగపతి మరియు యారీక్  స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇంత బొల్డ్ కాన్సెప్ట్ పై సినిమా రావాలంటే చాలా ధైర్యం చేయాలి. ఒక పోస్టర్ తోనే అందరిని ఆకట్టుకున్న ఈ 'పూర్ణ చంద్రరావు' ముందు ముందు ఇంకేం చేస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: