
ఇక యాంకర్, నటి గాయత్రి భార్గవి చాలానే సినిమాలలో నటించింది. ఈమె నటించిన చాలా సినిమాలు కూడా మంచి హిట్ టాక్ ని అందుకున్నాయి. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన అత్తారింటికి దారేది సినిమాలో నటించింది. జూనియర్ ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ లో, దుల్కర్ సల్మాన్ నటించిన లక్కీ భాస్కర్ లో నటించింది. అలాగే ఈమె బలాదూర్, గాలిపటం, ఒక లైలా కోసం, తీన్మార్ లాంటి చాలా సినిమాలలో ఈమె సహాయక పాత్రలు పోషించింది. ఈమె చాలా మంది హీరోల సినిమాలలో నటించి మెప్పించింది.
ఇటీవలే గాయత్రి భార్గవి తన సోషల్ మీడియా వేదికలో ఓ పోస్ట్ పెట్టింది. ఆ వీడియోలో ఆమె మాట్లాడుతూ.. 'యూట్యూబ్ మరియు సోషల్ మీడియా చాలా దిగజరిపోయింది. ఛానెల్స్ లో వ్యూస్ రావడం కోసం నీచమైన థంబ్ నెయిల్స్ పెడుతున్నారు. ఆ థంబ్ నెయిల్స్ చూసి ప్రేక్షకులు మోసపోతున్నారు' అని ఫైర్ అయ్యింది. అయితే ఈమె తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేసింది. తాను ఒక ఇంటర్వ్యూలో చాలా సెన్సిటివ్ ఇష్యూ గురించి మాట్లాడితే.. దానికి దారుణమైన థంబ్ నెయిల్స్ పెట్టి తన కుటుంబం ఫోటోలను పెట్టారని ఆమె చెప్పుకొచ్చింది.