
ఈమె ఎప్పుడు తన స్టైలిష్, హాట్ అవుట్‌ఫిట్స్‌తో అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటుంది. దిశా పటానీ, హీరో వరుణ్ తేజ్ నటించిన లోఫర్ సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఈ సినిమాలో నటుడు వరుణ్ తేజ్ కి జోడీగా నటించింది. ఆ తర్వాత ఈమె టాలీవుడ్ లో ఏం నటించలేదు. ఈమె ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలలో నటిస్తుంది. బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ చాలానే బీజీ అయిపోయింది. ఈమె గతేడాది టాలీవుడ్ సినిమా కల్కి 2898 ఏడీ లో నటించి మరో హిట్ అందుకుంది.
దిశా పటానీ హిట్ లతో పాటుగా డిజాస్టర్ లను కూడా రుచి చూసింది. ప్రభాస్ కల్కి సినిమా సూపర్ హిట్ అందుకోగా.. సూర్యతో కలిసి నటించిన కంగువా సినిమా మాత్రం ఫ్లాప్ అయ్యింది. అయినప్పటికీ ఈ అందాల భామకి మాత్రం ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు. దిశా పటానీ బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది.