
ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది ఇప్పటివరకు స్పష్టత రాలేదు. అయితే ఈ సినిమా కథ ఇప్పటికే గ్లామరస్ హీరోయిన్ కీర్తి సురేష్ కి చెప్పినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించనున్నట్లు టాక్ వినిపిస్తుంది. మొదట ఈ సినిమాకు సాయి పల్లవి హీరోయిన్ గా అనుకున్నారు అంట. కానీ తనకి డేట్స్ సెట్ అవ్వకపోవడంతో ఆమె తప్పుకున్నట్లు వార్తలు వినిపించాయి. ఇక ఈ సినిమాలో నటించడానికి కీర్తి సురేష్ ఒకే చెప్తే.. నితిన్ తో రెండో సినిమా చేస్తున్నట్లే. ఎందుకంటే వీరిద్దరి కాంబోలో ఇప్పటికే రంగ్ దే సినిమా తెరపైకి వచ్చింది. మరి ఈ సినిమాకు మహానటి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో లేదో చూడాలి మరి.
ఒకవేళ ఈ సినిమాకు కీర్తి సురేష్ ఒప్పుకుంటే, తాను పెళ్లి తర్వాత నటించే మొదటి తెలుగు సినిమా ఇదే అవుతుంది. ఇక అందాల భామ నేను శైలజ అనే సినిమాతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హిట్ అందుకుంది. తన నటన, అందంతో మంచి మంచి అవకాశాలు కొట్టేసింది. ఆ తర్వాత ఈమె రంగ్ దే, మహానటి, దసరా, భోళా శంకర్ లాంటి సినిమాలలో నటించి ప్రేక్షకులు అలరించింది. ఈమె తెలుగుతో పాటుగా తమిళం సినిమాలలో కూడా నటించింది.