
ఇదిలా ఉండగా.. ఒక సూపర్ హిట్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. జితు అష్రఫ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆఫీసర్ ఆన్ డ్యూటీ సినిమా ఓటీటీలో ఆడుతుంది. ఈ సినిమాలో కుంచాకో బోబన్, ప్రియమణి, జగదీష్, విశాక్ నాయర్ ముఖ్యపాత్రలలో నటించారు. ఈ సినిమాను మార్టిన్ ప్రక్కట్ ఫిల్మ్స్ & ఈఫోర్ సంస్థ బ్యానర్‌పై మార్టిన్ ప్రక్కట్, రెంజిత్ నాయర్, సిబి చవారా నిర్మించారు. ఆఫీసర్ ఆన్ డ్యూటీ మూవీ మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా విడుదల అయ్యింది. ఈ సినిమా విమర్శకులచే మెప్పులు పొందింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ కొట్టింది. మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులకు ఆకట్టుకుంది.
అయితే ఆఫీసర్ ఆన్ డ్యూటీ సినిమా ఓటీటీ ప్లాట్ ఫామ్ లోకి వచ్చింది. ఈ నెల 14 నుండి ఈ సినిమా ఓటీటీ ప్లాట్ ఫామ్ అయిన నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ అవ్వనుంది. ఈ సినిమా రిలీజ్ అయిన వారానికే ఓటీటీలోకి వచ్చేసింది. ఈ మూవీని రూ. 12 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించగా.. బాక్సాఫీస్ వద్ద రూ. 50 కోట్లకు పైగా కలెక్షన్స్ ని రాబట్టింది.