వేణు స్వామి చేసే కామెంట్లు ఎప్పుడు ఏ టర్న్ తీసుకుంటాయో తెలియడం లేదు. ఆయన చెప్పిన జోస్యం కొంతవరకు నిజమవ్వడంతో చాలామంది ఈయనపై నమ్మకం పెట్టుకున్నారు. దాంతో పూజలు, యజ్ఞలు, హోమాలు కూడా చేయించుకున్నారు. అలాంటి వేణు స్వామికి ఉన్నట్టుండి షాక్ తగిలింది.మళ్ళీ ఎవరికి కూడా జాతకాలు చెప్పనని, రాజకీయాల గురించి సినిమాల గురించి మాట్లాడనని ఓ సంచలన వీడియో రిలీజ్ చేశారు.ఆ తర్వాత మళ్లీ నాగచైతన్య శోభితల గురించి చెప్పి సంచలనం సృష్టించారు. కానీ ఈ విషయంపై కోర్టు సీరియస్ అవ్వడంతో సైలెంట్ అయిపోయారు. అయితే రీసెంట్గా వేణు స్వామి మాట్లాడిన ఓ ఆడియో కాల్ లీక్ అయింది. 

ఆడియో కాల్ లో ప్రభాస్ కి ప్రాణగండం ఉందని, సమంత,విజయ్ దేవరకొండలు కచ్చితంగా సూసైడ్ చేసుకుంటారంటూ చెప్పడం ఇండస్ట్రీలో కలకలం సృష్టించింది. అయితే తాజాగా మరో వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. అదేంటంటే..ఆ పొలిటిషియన్ ని ఓ హీరోయిన్ ని పెళ్లి చేసుకోబోతుంది అంటూ వేణు స్వామి సంచలనం సృష్టించారు.మరి ఇంతకీ ఆ పొలిటిషియన్ ఎవరు.. ఆ హీరోయిన్ ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం. రీసెంట్ గా ఓ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వేణు స్వామి మాట్లాడుతూ.. ఈ మధ్యనే తమిళ చిత్ర రంగంలో నుండి పొలిటికల్ రంగ ప్రవేశం చేసిన సూపర్ స్టార్ ఈ ఏడాది చివర్లో తన భార్యకు విడాకులు ఇచ్చేసి మరో హీరోయిన్ ని పెళ్లాడతారు. 

ఇది నిజం అంటూ చెప్పుకొచ్చారు. అయితే తమిళ ఇండస్ట్రీ నుండి  పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు అంటే అందరికీ గుర్తుకు వచ్చేది విజయ్ మాత్రమే.విజయ్ రీసెంట్ గానే తమిళ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే గత కొద్ది రోజుల నుండి విజయ్ తన భార్యకి మధ్య సఖ్యత లేదని,విజయ్ హీరోయిన్ త్రిష ప్రేమలో మునిగి తేలుతున్నారని,త్వరలోనే విజయ్ త్రిష పెళ్లి చేసుకుంటారని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో వేణు స్వామి చెప్పిన మాటలు మరింత అనుమానాలు కలిగిస్తున్నాయి. వేణు స్వామి మాట్లాడింది విజయ్ త్రిష ల గురించేనని ఈయన చెప్పింది నిజమైతే విజయ్ త్రిషలు పెళ్లి చేసుకుంటారని చాలామంది కామెంట్లు పెడుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: