సల్మాన్ ఖాన్ 60 ఏళ్ల వయసుకి దగ్గర పడుతున్నా పెళ్లి చేసుకోక పోయినప్పటికీ చాలా రోజుల నుండి అమ్మాయిలకు సంబంధించిన వివాదాల్లో దూరంగా ఉంటున్నారు. కానీ తాజాగా ఓ హీరోయిన్ విషయంలో పెళ్లి అయినా ఆమెను వదిలేదే లేదు అంటూ ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతకొద్ది రోజుల నుండి సల్మాన్ ఖాన్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ఉంటున్న సంగతి మనకు తెలిసిందే. ఎప్పుడైతే బీష్ణోయ్ గ్యాంగ్ వల్ల బాబా సిద్ధికి మరణించాడో అప్పటినుండి సల్మాన్ ఖాన్ చాలా జాగ్రత్తగా ఉండడంతో పాటు బయట  ఎక్కడా కూడా కనిపించడం లేదు.అయితే రీసెంట్ గానే ఆయన మురగదాస్ డైరెక్షన్లో సికిందర్ మూవీని కంప్లీట్ చేశారు.ఈ సినిమా మార్చ్ 30న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకి సంబంధించి ట్రైలర్ ని రిలీజ్ చేశారు. అయితే ఈ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్గా నిర్వహించారు మూవీ  యూనిట్.

ఈ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న సల్మాన్ ఖాన్ రష్మికకి తనకి మధ్య వస్తున్న ఏజ్ ట్రోల్స్ పై స్పందించారు.అయితే ఈ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో రష్మికతో తనకి ఉన్న ఏజ్ గ్యాప్ గురించి మాట్లాడుతూ.. నాకు రష్మికకు మధ్య ఏజ్ గ్యాప్ ఉంది అంటూ విమర్శలు చేస్తున్నారు. అసలు ఈ ఏజ్ గ్యాప్ విషయంలో ఆమెకు ఎలాంటి ఇబ్బంది లేదు. అలాగే ఆమె తండ్రికి కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. వాళ్ళిద్దరికీ లేని ఇబ్బంది మీకెందుకు అంటూ సరదాగా స్పందించారు సల్మాన్ ఖాన్.. అంతేకాదు రష్మికకు పెళ్లయిన వదలేది లేదు.పెళ్లయినా కూడా ఆమెతో నటిస్తాను. అలాగే ఆమెకి కూతురు పుడితే ఆ కూతురితో కూడా సినిమాల్లో నటిస్తాను అంటూ సల్మాన్ ఖాన్ సరదాగా చెప్పుకొచ్చారు. అయితే సల్మాన్ ఖాన్ రష్మిక కి మధ్య ఏజ్ గ్యాప్ దాదాపు 31 సంవత్సరాలు.

ఈ విషయంలోనే చాలామంది సోషల్ మీడియాలో ఈ జంట పై విమర్శలు చేశారు.దాంతో సల్మాన్ ఖాన్ తనదైన శైలిలో ఆన్సర్ ఇచ్చారు.. ఇక సల్మాన్ ఖాన్ రష్మిక మందన్నా హీరో హీరోయిన్గా చేసిన ఈ మూవీలో కాజల్ అగర్వాల్ ఓ కీలక పాత్రలో నటిస్తోంది. అలాగే ఈ మూవీలో విలన్ గా నటుడు సత్యరాజ్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో రష్మిక డెడికేషన్ చూసిన సల్మాన్ ఖాన్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ.. రష్మిక పుష్పటు, సికిందర్ రెండు సినిమాలను ఒకేసారి చేసింది.అటు ఆ సినిమాలో ఇటు ఈ సినిమాలో రెండింట్లో పాల్గొని ఆమె కాలికి గాయమైన కూడా షూటింగ్ కి ఇబ్బంది కలకూడదు అనే ఉద్దేశంతో ప్రమోషన్స్ చేసింది. అలాగే డే టైమ్ మొత్తం పుష్ప టు మూవీకి నైట్ టైం మొత్తం సికిందర్ మూవీకి కేటాయించి తన డెడికేషన్ తో అందరిని ఫిదా చేసింది అంటూ రష్మికపై ప్రశంసలు కురిపించారు సల్మాన్ ఖాన్

మరింత సమాచారం తెలుసుకోండి: