నాచురల్ స్టార్ నానిసినిమా చేసిన కూడా ఆ సినిమా మినిమం హిట్ గ్యారెంటీ.. దర్శక నిర్మాతలకు నానితో సినిమా చేస్తే ఖచ్చితంగా హిట్ వస్తుంది అనే ఒక నమ్మకం వారిలో ఉంటుంది.అలా నాని ఈ మధ్యకాలంలో చేసిన సినిమాలన్నీ ఒక్కటి కూడా ప్లాఫ్ అవ్వకుండా కనీసం యావరేజ్ హిట్ అయినా కొడుతున్నారు. ముఖ్యంగా దసరా సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారడమే కాకుండా ఫస్ట్ టైం తన సత్తా ఏంటో నిరూపించుకున్నారు. ఎందుకంటే ఇన్ని రోజులు నాని చేసింది ఒకెత్తయితే దసరా మూవీలో చేసిన యాక్టింగ్ మరో ఎత్తు అని చెప్పుకోవచ్చు.ఆ తర్వాత వచ్చిన హాయ్ నాన్న, సరిపోదా శనివారం ఇలా వరుస సినిమాలు హిట్ కొడుతూ నాని ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం నాని చేతిలో శ్రీకాంత్ ఓదెలతో ది ప్యారడైజ్ మూవీ అలాగే హిట్ -3 తో పాటు మరో సినిమా కూడా ఉంది.

అలా చేతినిండా సినిమాలతో దూసుకుపోతున్న నాని హిట్ సినిమాలో ఆ సాంగ్ అస్సలు సెట్ అవ్వలేదు అంటూ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్లు చేశారు. మరి ఇంతకీ నాని నటించిన ఏ సినిమాలోని పాట తమన్ కి నచ్చలేదో ఇప్పుడు చూద్దాం. నాని శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో దసరా మూవీ వచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమాలో అందరూ డీ గ్లామరస్ లుక్ లోనే కనిపించారు.ముఖ్యంగా ఈ సినిమాలోని "చంకీల అంగీలేసి ఓ వదినే" అనే పాట ఓ రేంజ్ లో వైరల్ అయింది.అయితే ఈ పాట గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించిన మ్యూజిక్ డైరెక్టర్ తమన్ చంకీల అంగిలేసి అనే పాట ఆడియో పరంగా సూపర్ డూపర్ హిట్ కొట్టింది. కానీ వీడియో ఆ పాటకి అంతగా మ్యాచ్ అవ్వలేదు. ముఖ్యంగా దర్శకుడు కొరియోగ్రఫీ ఈ పాటకి తగ్గట్టు విజువల్స్ ని అందించలేకపోయారు. 

అయితే ఈ పాటకి మ్యూజిక్ అందించిన సంతోష్ నారాయణ్ తప్పేమీ లేదు. ఎందుకంటే ఈ పాట మ్యూజిక్ పరంగా అద్భుతంగా ఉంది. కానీ ఈ పాటకి తగ్గట్లు విజువల్స్ ని కళ్ళకు కట్టినట్లు చూపించడంలో కొరియోగ్రాఫర్,దర్శకుడు ఇద్దరు ఫెయిల్ అయ్యారు అంటూ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ నాని దసరా మూవీలోని చంకిల్ అంగిలేసి అనే పాటపై షాకింగ్ కామెంట్లు చేశారు. అయితే తమన్ మాట్లాడిన వీడియో నెట్టింట్లో వైరల్ అవ్వడంతో కొంతమంది నిజమే అని పాజిటివ్ గా స్పందిస్తే మరి కొంతమంది నెగటివ్గా స్పందిస్తున్నారు. ఏది ఏమైనప్పటికి చంకిలా అంగిలేసి అనే పాట వినడానికి బాగుంటుంది కానీ చూడ్డానికి విజువల్ అంతగా ఎవరిని ఆకట్టుకోలేదు. తమన్  మాట్లాడిన మాటల్లో ఎలాంటి తప్పులేదు అంటూ చాలామంది తమన్ ని సపోర్ట్ చేస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: