చాలామంది నటీనటులు ఇండస్ట్రీ మీద ఉన్న ప్రేమతో ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా చివరి వరకు ఇండస్ట్రీలో ఉండాలి అని అనుకుంటారు. అలా చివరి వరకు ఇండస్ట్రీలో ఉండాలి అని పట్టుదలతో శ్రమించిన వాళ్ళు స్టార్లుగా మారతారు. వారి హార్డ్ వర్కే వారి కెరీర్ కి పునాదిలా మారి చివరికి ఉన్నత శిఖరాలకు చేరుతారు. అలా ఇండస్ట్రీలో ఎంతో మంది తమ హార్డ్ వర్క్ తో స్టార్లుగా మారిన వారు ఉన్నారు.కొంత మంది చిన్నచిన్న ఇబ్బందులకే ఇండస్ట్రీ వదిలి పారిపోతారు. అయితే ఈ హీరో తన తల్లి నగలు తాకట్టు పెట్టి మరీ ఓ సినిమా తీసి సర్వనాశనం అయ్యారు.మరి ఇంతకీ ఆ హీరో ఎవరు అనేది చూస్తే యంగ్ హీరో శర్వానంద్.. కుర్ర హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శర్వానంద్ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో చిన్న చిన్న క్యారెక్టర్ రోల్స్ చేసేవారు. అలా స్టార్ హీరోల సినిమాల్లో తమ్ముడు పాత్రలు వంటివి చేసేవారు. శర్వానంద్ కి గుర్తింపు వచ్చిన మూవీ గమ్యం అని చెప్పుకోవచ్చు. గమ్యం మూవీలో శర్వానంద్ తో పాటు అల్లరి నరేష్ కూడా నటించారు.

సినిమా ద్వారా శర్వానంద్ కి మంచి ఇమేజ్ వచ్చింది.ఆ తర్వాత శర్వానంద్ చేసిన ఏ సినిమాలు కూడా అంత హిట్ అవలేదు. దాంతో చివరికి శర్వానంద్ స్వయంగా తన తల్లి నగలు తాకట్టు పెట్టి మరీ కో అంటే కోటి అనే సినిమాకి నిర్మాతగా చేశారు. అయితే నగలు తాకట్టు పెట్టి మరీ సినిమా తీస్తే చివరికి రిజల్ట్ మాత్రం అట్టర్ ప్లాఫ్.సినిమా డిజాస్టర్ అవ్వడంతో పెట్టిన డబ్బులు మొత్తం పోయి శర్వానంద్ నష్టాల్లో కూరుకుపోయారు. అలాగే అప్పు ఇచ్చిన స్నేహితులు కూడా శర్వానంద్ తో మాట్లాడడం మానేసారట. కానీ అదే టైంలో శర్వానంద్ నటించిన రన్ రాజా రన్ మూవీ విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.. ఇక ఈ సినిమా హిట్ కొట్టడంతో ఈ సినిమా ని నిర్మించిన యూవి క్రియేషన్స్ బ్యానర్ వాళ్ళు ఒక పెద్ద పార్టీని అరేంజ్ చేశారు.ఆ పార్టీకి ప్రభాస్ కూడా వచ్చారు. ఎందుకంటే యూవి క్రియేషన్స్ ప్రభాస్ అన్నయ్య ప్రబోద్ ది కాబట్టి ఆ పార్టీకి ప్రభాస్ కూడా వచ్చారట.

 రన్ రాజా రన్ మూవీ బ్లాక్ బస్టర్ అవ్వడంతో సక్సెస్ వచ్చిన ఆనందంలో చిత్ర యూనిట్ మొత్తం ఎంతో హ్యాపీగా ఆ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటే శర్వానంద్ మాత్రం అందరికీ దూరంగా పార్టీలో ఓ మూలన కూర్చొని చాలా డల్ గా ఉండి ఏదో ఆలోచిస్తున్నట్టు కనిపించారట.అయితే శర్వానంద్ ని చూసిన ప్రభాస్ సినిమా హిట్ కొట్టాక కూడా ఎందుకు అలా ఆలోచిస్తూ సైలెంట్ గా మూలన కూర్చున్నావు.ఏమైంది అని అడగడంతో జరిగిన విషయం చెప్పారట. ఇక శర్వానంద్ తో ప్రభాస్ మాట్లాడుతూ.. చిన్న చిన్న ఇబ్బందులకే కృంగిపోకూడదు. ఈ సినిమా హిట్ కొట్టావు కాబట్టి నీ కెరీర్ మారిపోతుంది.భవిష్యత్తులో నువ్వు మంచి స్టార్ అవ్వడం ఖాయం. మంచి టాలెంట్ ఉన్న నటుడివి నువ్వు. ఇలా బాధపడుతూ కూర్చుంటే లాభం లేదు.హార్డ్ వర్క్ చేసుకుంటూ పోతే సక్సెస్ అదే వస్తుంది అంటూ శర్వానంద్ ని ఓదార్చారట ప్రభాస్. ఆరోజు ప్రభాస్ చెప్పిన మాటలే శర్వానంద్ కి ఇప్పటికి కూడా గుర్తున్నాయంటూ శర్వానంద్ ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని బయటపెట్టారు

మరింత సమాచారం తెలుసుకోండి: