
అలాగే ఈ సినిమాకు మెయిన్ అసెర్ట్ అయిన ప్రభాస్ “ రుద్ర” అనే పాత్రలో నటించాడు..ప్రభాస్ నటించిన రుద్ర అనే పాత్ర సినిమాకు ప్లస్ అవుతుందని మూవీ టీం చాలా నమ్మకంగా వుంది..రుద్ర పాత్ర దాదాపు 25-30 నిమిషాలు ఉంటుందని సమాచారం.. కన్నప్ప సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 25 న మేకర్స్ గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.. ప్రస్తుతం చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలలో బిజీగా వుంది.. ఈ చిత్రం నుండి రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్ కి మంచి స్పందన వచ్చింది.. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రఘుబాబు షాకింగ్ కామెంట్స్ చేసారు..కన్నప్ప సినిమాను ఎవరైనా ట్రోల్ చేస్తే శివుడి ఆగ్రహానికి గురవుతారని.. శివయ్య శాపానికి గురవుతారని అన్నారు.. అయితే దీనికి నెటిజన్స్ స్ట్రాంగ్ రిప్లై ఇస్తున్నారు.. సినిమాను ట్రోల్ చేసిన వారు శాపానికి గురైతే సినిమా సరిగ్గా తీయని వారు నరకానికి వెళ్తారా అని కౌంటర్ ఇస్తున్నారు..