
ఎట్టకేలకు నిన్నటి రోజున రాత్రి హైదరాబాదులో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని చాలా ఘనంగా ఏర్పాటు చేయగా అక్కడ స్పెషల్ అట్రాక్షన్ గా డేవిడ్ వార్నర్ కూడా హాజరయ్యారు.. అతని చేతులు మీదుగానే ట్రైలర్ ని విడుదల చేయడం మరింత ఆసక్తిని రేపింది. సెకండ్ హాఫ్ లో డేవిడ్ వార్నర్ రాబిన్ హుడ్ చిత్రంలో ప్రత్యేకమైన పాత్రలో నటిస్తూ ఉన్నారట.. ఇక ట్రైలర్ విషయానికి వస్తే గతంలో అ ఆ, భీష్మ , గుండెజారి గల్లంతయ్యిందే తదితర చిత్రాలలో కామెడీతో ఎలా అదరగొట్టారు నితిన్ అలాగే అదరగొట్టేసేలా కనిపిస్తూ ఉన్నది..
ట్రైలర్ విషయానికి వస్తే నా పేరు రామ్ సార్.. సిచువేషన్ కి తగ్గట్టుగా తన పేరు రాబిన్ ఫుడ్ గా మార్చుకుంటాను అంటూ నితిన్ చెప్పే డైలాగ్ తో ట్రైలర్ మొదలవుతుంది.. రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్ , నితిన్ మధ్య జరిగే కామెడీ సన్నివేశాలు ట్రైలర్లు హైలెట్గా ఉన్నాయి. అలాగే ఇందులో దసరా సినిమాలో నటించిన విలన్ పోలీస్ ఆఫీసర్గా నటించారు. శ్రీలీల కూడా ఇందులో అద్భుతమైన పాత్రలో నటించడమే కాకుండా ఈమె గ్లామర్ కూడా ఈ సినిమాకి మరింత ఆకర్షణీయంగా నిలిచేలా ట్రైలర్లో కనిపిస్తోంది. మొత్తానికి కామెడీతోనే ట్రైలర్ ని అదరగొట్టిన రాబిన్ హుడ్ సినిమా ప్రేక్షకులను ఏవిధంగా మెప్పిస్తుందో చూడాలి.