
నితిన్ తండ్రి ప్రముఖ నిర్మాత కావడంతో ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ విపరీతంగా ఉండటంతో నితిన్ ఎన్ని పరాజయాలు వచ్చినా తట్టుకోగలుగుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల మధ్య గతంలో తనకు హిట్ ఇచ్చిన వెంకీ కుడుముల దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తీసిన ‘రాబిన్ హుడ్’ రాబోయే ‘ఉగాది’ ని టార్గెట్ చేస్తూ విడుదలకాబోతోంది.
నితిన్ కెరియర్ లో ఇప్పటివరకు తీసిన సినిమాలలో ఇదే భారీ బడ్జెట్ అని అంటున్నారు. యూత్ లో విపరీతమైన క్రేజ్ ఉన్న శ్రీలీల నితిన్ పక్కన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ కాంబినేషన్ చాలదు అన్నట్లుగా ఆస్ట్రేలియా క్రికెట్ ప్లేయర్ డేవిడ్ వార్నర్ ఈమూవీలో ఒక కీలక పాత్రలో కనిపించడం ప్రస్తుతం సంచలనంగా మారింది.
తెలుగు సినిమాలలోని హిట్స్ సాంగ్స్ కు డాన్సు రీల్స్ చేయడం ద్వారా డేవిడ్ వార్నర్ కు విపరీతమైన క్రేజ్ ఉంది. ముఖ్యంగా ‘పుష్ప 1’ విడుదల సమయంలో ఇతడు చేసిన వీడియోలు వైరల్ గా మారిన విషయం తెలిసిందే. ఇతడికి యూత్ లో ఉన్న క్రేజ్ ను పసిగట్టిన నితిన్ పట్టుపట్టి ఒక అతిధి పాత్రలో రాబిన్ హుడ్ లో నటింపచేసినట్లు తెలుస్తోంది. ఈ అతిథి పాత్రకు ఏకంగా 2.5 కోట్లు పారితోషికం ఇచ్చారని వార్తలు వస్తున్నాయి. అయితే సినిమాలు ఎక్కువగా చూసే మాస్ ప్రేక్షకులకు ఇండియన్ క్రీకటర్స్ పేర్లు బగ్ తెలుస్తాయి కానీ విదేశీ క్రీకటర్ల పేర్లు పెద్దగా తెలియవు. ఇలాంటి పరిస్థితులలో డేవిడ్ వార్నర్ వల్ల నితిన్ ‘రాబిన్ హుడ్’ సినిమాకు ఎంత మేలు జరుగుతుంది అన్నది వచ్చే వారం తేలిపోతుంది..