
కొన్ని చిత్రాలలో విలన్ గా కూడా నటించిన ఈ నటుడు.. ఇటీవలే హైదరాబాదులో నిర్వహించినటువంటి భగత్ సింగ్ యువజన ఉత్సవాల ముగింపు వేడుకలలో భాగంగా హాజరయ్యారు.. ఈ సందర్భంగా నటుడు అజయ్ ఘోష్ మాట్లాడుతూ.. ప్రపంచంలో కమ్యూనిస్టు పార్టీల అవసరం చాలానే ఉన్నదని ఇప్పటికే చాలామంది చాలా దేశాలలో కమ్యూనిస్టు పార్టీలు అధికారంలోకి వచ్చాయని కానీ మన దేశంలో మాత్రం ఎక్కడా రావడం లేదంటే తెలియజేశారు. అందుకు కారణాలు చాలానే ఉన్నాయి కానీ ఈ దేశంలో కమ్యూనిస్టు పార్టీలు ఏకం కావాల్సిన అవసరం ఉన్నదని కూడా తెలియజేశారు అజయ్ ఘోష్.
కమ్యూనిస్టు పార్టీల నేతలు ఒక మెట్టు దిగి మరి ప్రజల కోసం ఏకం కావాలి అంటూ ఈ దేశాన్ని కాపాడాల్సింది కమ్యూనిస్టు పార్టీలే అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఎప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.. కానీ నటుడు అజయ్ ఘోష్ ఇతర పార్టీల గురించి మాట్లాడకుండా కేవలం కమ్యూనిస్టు పార్టీల గురించి మాట్లాడడంతో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్నది. అయితే ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా రాజకీయాలలో మాత్రం అటు ఏపీలో వైసిపి జనసేన టిడిపి బిజెపిని కనిపిస్తూ ఉన్నాయి.. తెలంగాణలో అయితే కాంగ్రెస్, బిఆర్ఎస్, బిజెపి పార్టీలు మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి.