టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొన్ని సంవత్సరాల క్రితం నాయక్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో రామ్ చరణ్ రెండు పాత్రలలో నటించాడు. ఇక ఈ మూవీలోని రెండు పాత్రల్లో రామ్ చరణ్ తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ , అమలా పాల్ హీరోయిన్లుగా నటించారు. వీరిద్దరూ కూడా ఈ సినిమాలో తమ అందాలతో , నటనతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నారు.

వి వి వినాయక్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా ... ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. కొన్ని సంవత్సరాల క్రితం మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమాను మరో సారి థియేటర్లలో రీ రిలీజ్ చేయనున్నారు. తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. అసలు విషయం లోకి వెళితే ... మార్చి 27 వ తేదీన రామ్ చరణ్ పుట్టిన రోజు అనే విషయం మన అందరికీ తెలిసిందే.

ఇకపోతే ఆయన పుట్టిన రోజు సందర్భంగా నాయక్ మూవీ ని మార్చి 27 వ తేదీన రీ రిలీస్ చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు తాజాగా అధికారికంగా ప్రకటించారు. అలాగే ఈ మూవీ కి సంబంధించిన టికెట్ బుకింగ్లు కూడా ఓపెన్ అయినట్లు ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటించారు. మరి ఈ మధ్య కాలంలో రీ రిలీజ్ అయిన చాలా తెలుగు సినిమాలు బాక్సా ఫీస్ దగ్గర మంచి కలెక్షన్లను రాబట్టాయి. మరి నాయక్ సినిమా ఏ స్థాయి కలెక్షన్లను రీ రిలీజ్ లో బాగంగా వసూలు చేసి ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: