తెలుగు సినిమా పరిశ్రమలో అద్భుతమైన నిర్మాణ సంస్థలలో మైత్రి సంస్థ ఒకటి. మైత్రి సంస్థ వారు వరుస పెట్టి సినిమాలను నిర్మిస్తూ అందులో చాలా సినిమాలతో మంచి విజయాలను అందుకుంటూ అద్భుతమైన స్థాయిలో ఈ బ్యానర్ ను ముందుకు సాగిస్తున్నారు. ప్రస్తుతం మైత్రి బ్యానర్ పై నవీన్ , రవి శంకర్ సినిమాలను నిర్మిస్తూ వస్తున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ బ్యానర్ వారు నితిన్ హీరోగా శ్రీ లీల హీరోయిన్గా వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిన రాబిన్ హుడ్ సినిమాను నిర్మించారు. ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ హాటెస్ట్ బ్యూటీ కేతిక శర్మ స్పెషల్ సాంగ్ లో నటించింది.

ఇప్పటికే ఈ మూవీలో కేతిక చేసిన స్పెషల్ సాంగ్ లిరికల్ వీడియోను మేకర్స్ విడుదల చేయగా , దానికి అద్భుతమైన రెస్పాన్స్ జనాల నుండి లభిస్తుంది. ఈ మూవీ ని మార్చి 28 వ తేదీన విడుదల చేయనున్నారు. నిన్న రాత్రి ఈ మూవీ బృందం వారు ఈ సినిమా యొక్క ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను భారీ ఎత్తున నిర్వహించారు. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో భాగంగా ఈ మూవీ నిర్మాతలలో ఒకరు అయినటువంటి రవి శంకర్ మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.

రాబిన్ హుడ్ ట్రైలర్ ఈవెంట్లో భాగంగా రవి శంకర్ మాట్లాడుతూ ... పుష్ప మూవీ లో ఊ అంటావా .. ఊ ఊ అంటావా పాటకు ఫస్ట్ కేతిక శర్మ ను తీసుకుందాం అనుకున్నాం. కానీ ఆ సమయంలో అది కుదరలేదు. ఇక రాబిన్ హుడ్ సినిమాలో కేతిక శర్మ స్పెషల్ సాంగ్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది అని ప్రొడ్యూసర్ రవి శంకర్ చెప్పుకొచ్చాడు. ఇది ఇలా ఉంటే పుష్ప మూవీ ని కూడా మైత్రి సంస్థ వారు నిర్మించారు. పుష్ప మూవీలోని ఊ అంటావా ... ఊ ఊ అంటావా సాంగ్ లో సమంత నటించింది. ఈ సాంగ్ ద్వారా సమంత కి ఇండియా వ్యాప్తంగా క్రేజ్ వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: