డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ది మోస్ట్ అవెంటెడ్ సినిమాల్లో హరిహర వీరమల్లు కూడా ఒకటి .. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి .. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు ఎంతో వేగంగా జరుగుతున్నాయి .. అయితే ఇప్పుడు ఈ వారం లో పవన్ కళ్యాణ్ కూడా తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ చెప్పబోతున్నట్లు ఓ వార్త తెలుస్తుంది .. అదే విధంగా పవన్ కళ్యాణ్ కు అందుబాటులో ఉండే విధంగా ప్రత్యేకమైన డబ్బింగ్ సెట్ ని కూడా చిత్ర యూనిట్ ఏర్పాటు చేశారట ..


అదే విధంగా పవన్ కూడా ఈ సినిమా కి ఇంకా కొన్ని డేట్స్ ఇవ్వాల్సి ఉంది ఇస్తే ఈ సినిమా మొత్తం కంప్లీట్ అవుతుంది .. అదేవిధంగా ఈ సినిమాను ముందుగా దర్శకుడు క్రిష్ మొదలుపెట్టిన .. ఆ తర్వాత ఏం రత్నం కొడుకు జ్యోతి కృష్ణ ఈ సినిమాను తన డైరెక్షన్లో పూర్తి చేశాడు .. అలాగే ఈ సినిమాల్లో పవన్ కు జంటగా నిధి అగర్వాల్ నటిస్తుంది ..  ప్రజెంట్ సెన్సేషన్ బాలీవుడ్ బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నాడు .. అలాగే సునీల్ , రఘుబాబు , సుబ్బరాజు , నోరా ఫతేహి వంటి వారు కీలకపాత్రలో నటిస్తున్నారు .. ఇక ఈ సినిమా కోసం పవన్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు .. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏఎం రత్నం ఈ సినిమాను నిర్మిస్తున్నారు .. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు .  


ఇక  ఇప్పుడు ఈ సినిమాను సమ్మర్ కానుకగా మే 9న ప్రేక్షకులు ముందుకు తీసుకురాబోతున్నారు .. అయితే ఇదే క్రమంలో పవన్ అభిమానుల్లో హరిహర వీరమల్లు కంటే ఓజి సినిమా పైన ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు .. పవన్ కూడా ఈ సినిమాకు ఒక వారం రోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉంది .. దానికి సంబంధించి టైం కేటాయిస్తే ఓజి కూడా ఈ సంవత్సరం లోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీగా ఉంది .. డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ ఓజి సినిమాకు టైం ఎప్పుడు కేటాయిస్తాడో చూడాలి ..  ఇక మరి సమ్మర్ కానుకగా పాన్ ఇండియా లెవెల్ లో ప్రేక్షకులు ముందుకు వస్తున్న హరిహర వీరమల్లు బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సంచనాల క్రియేట్ చేస్తుందో చూడాలి .

మరింత సమాచారం తెలుసుకోండి: