టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ కాలంలోనే అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న యువ నటి మనులలో శ్రీ లీల ఒకరు. ఈ ముద్దుగుమ్మ శ్రీకాంత్ కుమారుడు అయినటువంటి రోషన్ హీరోగా రూపొందిన పెళ్లి సందD అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ మామూలు విజయం సాధించిన ఇందులో ఈమె తన అందంతో , నటనతో , డాన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈమెకు ఈ మూవీ ద్వారా అద్భుతమైన గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఈ బ్యూటీ కి పెట్టి తెలుగు సినిమాలలో అవకాశాలు దక్కాయి.

దానితో ఈమె ప్రస్తుతం అద్భుతమైన జోష్లో టాలీవుడ్ ఇండస్ట్రీలో కెరియర్ను ముందుకు సాగిస్తోంది. తాజాగా శ్రీ లీల రాబిన్ హుడ్ అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీలో నితిన్ హీరోగా నటించగా ... వెంకీ కుడుముల ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు జీ వి ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా ... మైత్రి సంస్థ వారు ఈ మూవీ ని నిర్మించారు. ఈ సినిమాను మార్చి 28 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో నిన్న రాత్రి ఈ సినిమా యూనిట్ ఈ మూవీ కి సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను భారీ ఎత్తున నిర్వహించింది. ఇక ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో శ్రీ లీల స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.

మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు శ్రీ లీల అదిరిపోయే లుక్ లో ఉన్న స్కై బ్లూ కలర్ శారీని కట్టుకొని , అందుకు తగిన స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి విచ్చేసింది. ఇక ఆ లుక్ లో శ్రీ లీల అదిరిపోయే రేంజ్ లో ఉండడంతో రాబిన్ హుడ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు సంబంధించిన కెమెరాలన్నీ బ్యూటీ వైపు తిరిగాయి. ఇక ప్రస్తుతం ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో శ్రీ లీల కు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: