చిత్ర పరిశ్రమలో కొన్ని జంటలు ప్రేమించి పెళ్లి చేసుకున్ని ఆ తర్వాత కొన్ని రోజులకే విడిపోవడం మనం చూస్తూనే ఉన్నాం .. ఇదే క్రమంలో ఎన్నో సంవత్సరాలగా పెళ్లి చేసుకుని కలిసి ఉన్న జంటలు కూడా విడాకులు తీసుకోవడం ఈ రీసెంట్ టైమ్స్ లో చాలా జరుగుతున్నాయి .. ఇదే క్రమంలో విడాకులు తీసుకున్న తర్వాత మాజీ భార్య భరణం డిమాండ్ చేయటం ఎంతో కామన్ .. ఒక్కొక్కరు విడాకుల తర్వాత 100 కోట్ల రూపాయలకు పైగా భ‌రణం తీసుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి . ఎగ్జాంపుల్ హృతిక్ రోషన్ తన భార్యతో విడాకులు తీసుకున్న తర్వాత ఆమెకు రూ. 380 కోట్ల భరణం ఇచ్చాడు .. అప్పట్లోనే ఇది ఎంతో హాట్ టాపిక్ గా కూడా మారింది .. ఏ అమ్మాయి విడాకులు తీసుకున్న తర్వాత భరణం కోరుకోకుండా ఉండదు .. అయితే ఒక అమ్మాయి మాత్రం పైసా భరణం కూడా తీసుకోలేదు .. ఇంతకీ ఆమె మరి ఎవరో కాదు స్టార్ హీరోయిన్ సమంత .. 2021 వ సంవత్సరంలో ఈమెకు నాగచైతన్యతో విడాకులు జరిగింది .
 

అలా విడాకులు తీసుకున్న తర్వాత ఒప్పందం ప్రకారం 200 కోట్ల రూపాయలు భరణం అక్కినేని కుటుంబం సమంతకు ఇవ్వాల్సి ఉంది .. ఆ కుటుంబం ఇవ్వడానికి రెడీ గానే ఉన్నారట .. కానీ సమంత ఒక్క పైసా కూడా వారి నుంచి తీసుకోలేదట .. సమంత సన్నిహితులు కనీసం రూ. 50 కోట్ల  తీసుకోవాలని ఆమెకు పలు సలహాలు కూడా ఇచ్చారట కానీ సమంత మాత్రం అందుకు ఒప్పుకోలేదు .. నాకు ఎవరి నుంచి డబ్బులు అవసరం లేదని తన సొంత కాలు మీద తను నిలబడే సత్తా దైర్యం నాకు ఉందని ఆమె తన సన్నిహితుల దగ్గర ఎప్పుడూ చెబుతూ ఉండేదట .. ఇక విడాకుల తర్వాత సమంత మానసికంగా శారీరకంగా ఎన్నో ఇబ్బందులు కూడా ఎదుర్కొన్న విషయం అందరికీ తెలిసిందే .. అలాగే చావు బ్రతుకులతో పోరాడి బయటకు కూడా వచ్చింది .. ఆ సమయంలో ఆమె దగ్గర ఉన్న డబ్బులు కూడా బాగా ఖర్చయ్యాయి .. ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్ల స
మంత సినిమాలు  సంఖ్య కూడా బాగా తగ్గిపోయింది .  ఇలాంటి సమయంలో ఆమె అక్కినేని కుటుంబం ఇచ్చే భరణం తీసుకుని ఉండుంటే ఎంతో ఉపయోగపడేది కానీ ఆమె వారి నుంచి అలా ఆశించలేదు .
 

ఒంటరిగా ఉంటూ పోరాటం చేసింది కేవలం ఆమె నిలబడటమే కాకుండా ఒక ప్రొడక్షన్ హౌస్‌ను  కూడా మొదలుపెట్టి కొత్త వాళ్లను ఇండస్ట్రీకి తీసుకువచ్చి వాళ్లను నిలబెట్టే ప్రయత్నం కూడా చేస్తుంది .. ఇలాంటి ఆడవాళ్లు దేశంలో అరుదుగా ఉంటారు .  వీరిని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం మగవాళ్ళకైనా , ఆడవాళ్ళకైనా ఎంతైనా ఉంది .. అందుకే సమంతని అందరూ ఎంతో గౌరవిస్తూ ఉంటారు .. అయితే ఇప్పుడు ఇటీవ‌లే పూర్తిగా అనారోగ్యం నుంచి కొలుకున్న సమంత మళ్ళీ సినిమా షూటింగ్స్ లో బిజీగా మారింది .. ఇప్పటికే ఈమె మా ఇంటి బంగారం అనే సినిమా షూటింగ్లో పాల్గొంటుండగా .. నెట్ఫ్లిక్ సంస్థ తెరకెక్కిస్తున్న రక్త బ్రహ్మాండ్‌ అనే వెబ్ సిరీస్ లో కూడా ఒకీలక పాత్రలో నటిస్తుంది .  ఈ రెండే కాకుండా రామ్ చరణ్ , సుకుమార్ కాంబినేషన్లో వచ్చే సినిమాలో కూడా ఈమె హీరోయిన్గా నటించే అవకాశం ఉందని కూడా అంటున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: