ఒక సినిమా జనాల్లోకి వెళ్ళాలి అంటే హీరో-హీరోయిన్-డైరెక్టర్-ప్రొడ్యూసర్ కన్నా కూడా ముందుగా కావాల్సింది పేరు . సినిమా పేరు.  సినిమాకి ఒక మంచి పేరు పెడితే ఆటోమేటిక్గా జనాలకు దానిపై ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది . పేరు లేకుండా సినిమా షూటింగ్ జరుగుతున్న..  లేదు సినిమా షూటింగ్ జరిపిన తర్వాత పేరుని ఆసక్తికరంగా పెట్టకపోయినా మొత్తం కొలాప్స్ అవుతుంది.  ఆ విషయం అందరికీ తెలుసు కదా . ఇప్పుడు సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో ఓ హీరోని బాగా బాగా ట్రోల్ చేస్తున్నారు జనాలు . అది కూడా పెద్ద బడా పాన్ ఇండియా  స్టార్ కావడం గమనార్హం .


ఆయన మరెవరో కాదు "రామ్ చరణ్". మనకు తెలిసిందే రాంచరణ్ రీసెంట్ గా "గేమ్ చేంజర్" సినిమాతో బిగ్ ఫ్లాప్ ని తన ఖాతాలో వేసుకున్నాడు . ఇప్పుడు ఎలాగైనా బిగ్ హిట్ కొట్టడానికి ట్రై చేస్తున్నాడు.  అయితే రామ్ చరణ్ ప్రెసెంట్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నాడు . ఈ సినిమాలో హీరోయిన్గా శ్రీదేవి కూతురు జాన్వికపూర్ నటిస్తుంది . కాగా ఈ సినిమాకి "పెద్ది" అనే టైటిల్ ఫిక్స్ చేసారు అంటూ ఎప్పటినుంచో టాక్ వినిపిస్తుంది.



నిజానికి ఈ "పెద్ది" అనే టైటిల్ పెద్దగా ఆకర్షణీయంగా లేదు అంటూ మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా చెప్పుకొస్తూనే ఉన్నారు . కానీ బుచ్చిబాబు సనా మాత్రం ఎందుకు ఆ టైటిల్ కి అలాగే ఫిక్స్ అయిపోయాడు . రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా పెద్ది అనే టైటిల్ ని  రివిల్ చేయబోతున్నారట . దీనికి సంబంధించి అన్ని పనులు కూడా కంప్లీట్ చేసేసారట.  దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే వార్త బాగా వైరల్ గా మారింది . అయితే కొంతమంది ఈ పెద్ది టైటిల్లో పెద్దగా పస లేదు .. ఎన్నిసార్లు చెప్పినా వినవేంటి బుచ్చిబాబు అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడు "పెద్ది"  అనే టైటిల్ పెద్ద రచ్చరంబోలా చేస్తుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: