ఒక్కో మెట్టు పైకి ఎక్కి ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో అద్భుతమైన స్థాయిలో కెరీర్ను కొనసాగిస్తున్న వారిలో రవితేజ ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభంలో కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పని చేశాడు. ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలను దక్కించుకున్నాడు. ఇక నటుడిగా కెరియర్ ప్రారంభంలో ఈయన సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో , విలన్ పాత్రల్లో , కమెడియన్ పాత్రల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత సినిమాల్లో హీరోగా అవకాశాలను దక్కించుకున్నాడు.

ఇక హీరో గా అవకాశాలను దక్కించుకున్నాక రవితేజ మంచి విజయాలను అందుకుంటూ అద్భుతమైన జోష్ లో కెరీర్ ను ముందుకు కొనసాగాడు. దానితో ఈయనకు అదిరిపోయే రేంజ్ క్రేజ్ తెలుగు సినీ పరిశ్రమలో ఏర్పడింది. ప్రస్తుతం రవితేజ టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే రవితేజ చాలా సంవత్సరాల క్రితం నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ 2004 వ సంవత్సరం విడుదల అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. ఎస్ గోపాల్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇకపోతే 2004 వ సంవత్సరం విడుదల అయ్యి మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి ఆ సమయంలో అద్భుతమైన ప్రశంసలు దక్కాయి. ఇది ఈ ఉంటే ఈ సినిమాను రీ రిలీజ్ చేయనున్నారు.

అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను తాజాగా ఈ మూవీ బృందం వారు విడుదల చేశారు. ఈ మూవీ ని ఈ సంవత్సరం ఏప్రిల్ 5 వ తేదీన రీ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మరి రీ రిలీజ్ లో భాగంగా ఈ సినిమా ఎలాంటి కలెక్షన్లను వసూలు చేస్తుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: