రామ్ చరణ్ ఫ్యాన్స్ కి డబుల్ గూస్ బంప్స్ వచ్చే న్యూస్  ఇప్పుడు వెబ్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.  ఈ మధ్యకాలంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ఎటువంటి వార్తలు వింటున్నాం .. ఎటువంటి వార్తలు వైరల్ అవుతున్నాయి అనే విషయాల గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. మరీ ముఖ్యంగా రామ్ చరణ్ గురించి అందరూ కూడా ఎక్కువగా పాజిటివ్గా మాట్లాడుకుంటారు . కానీ గేమ్ చేంజర్ సినిమా తర్వాత మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోయింది . ప్రతి ఒక్కరు కూడా ఆయన గురించి నెగిటివ్ గా మాట్లాడుతున్నారు.


గేమ్ చేంజర్ సినిమాలో ఆయన పర్ఫామెన్స్ బాగున్నప్పటికీ కథ చూస్సింగ్ బాగాలేదు అంటూ ట్రోల్ చేశారు . అయితే ఇప్పుడు బుచ్చిబాబు సన దర్శకత్వంలో రామ్ చరణ్ ఒక సినిమా చేస్తున్నాడు.  అంతేకాదు ఈ సినిమా కంప్లీట్ అవ్వగానే టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమాను సెట్స్ పైకి తీసుకురాబోతున్నారు.  అయితే ఈ రెండు సినిమాలు పూర్తి అవ్వకముందే మరొక స్టార్ డైరెక్టర్ కు మాటిచ్చేసాడు రామ్ చరణ్ . ఆయన మరెవరో కాదు ప్రభాస్ తో సెన్సేషనల్ హిట్ అందుకున్న ప్రశాంత్ నీల్.



ప్రభాస్ తో సలార్ సినిమా ఎంత సూపర్ డూపర్ హిట్ గా మార్చేశాడో ప్రశాంత్ నీల్ అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అటువంటి ప్రశాంత్ నీల్ ఇప్పుడు రామ్ చరణ్ సినిమాకు కమిట్ అయ్యాడు అంటూ టాక్ వినిపిస్తుంది . అదే విధంగా జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా కంప్లీట్ అయిపోయిన మరో క్షణం రామ్ చరణ్ తో సినిమాను సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడట ప్రశాంత్ నీల్.  దీంతో మెగా ఫాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిపోతున్నారు.  రామ్ చరణ్ మూవీస్ చూస్సింగ్ లిస్ట్ బాగా హైలైట్ గా మారిపోయేలా ఉంది అంటున్నారు సినీ విశ్లేషకులు..!

మరింత సమాచారం తెలుసుకోండి: