టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న నటులలో నితిన్ ఒకరు. ఈయన తేజ దర్శకత్వంలో రూపొందిన జయం అనే మూవీ తో వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఈ సినిమాలో సదా హీరోయిన్గా నటించింది. సదా కూడా ఈ సినిమాతోనే తెలుగు తెరకు పరిచయం అయింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బ్లాక్ బాస్టర్ విజయం సాధించడంతో నితిన్ కు ఈ మూవీ ద్వారా మంచి విజయం దక్కింది. ఇకపోతే తాజాగా నితిన్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు.

ఆ ఇంటర్వ్యూలో భాగంగా నితిన్ "జయం" మూవీ కి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్పుకొచ్చాడు. తాజా ఇంటర్వ్యూ లో భాగంగా నితిన్ మాట్లాడుతూ ... జయం మూవీ లో ప్రియతమా తెలుసునా అనే సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్లో దాదాపు నేను రోప్ కి వేలాడుతూనే సాంగ్లో కనబడాల్సి ఉంటుంది. ఆ సాంగ్ ను ఏడు రోజుల పాటు షూట్ చేశారు. దానితో ఏడు రోజుల పాటు నేను కేవలం ఒక ఇడ్లీ తిని మాత్రమే ఆ సాంగ్ షూటింగ్లో పాల్గొన్నాను. అందుకు ప్రధాన కారణం ... ఆ సాంగ్ లో తాడు నా నడుముకు కట్టి ఉంటుంది. ఒక వేళ నేను బాగా తిన్నట్లు అయితే పొట్టపై ప్రెషర్ ఏర్పడి వాంతులు అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే నేను ఆ సాంగ్ షూట్ చేసిన ఏడు రోజుల పాటు కేవలం ఒకే ఇడ్లీ తిని ఆ సాంగ్ షూటింగ్లో పాల్గొన్నాను అని నితిన్ చెప్పుకొచ్చాడు.

అలాగే ఇప్పుడు రూప్ సిస్టం చాలా బాగుంది. పెద్దగా కష్టం ఏమీ ఉండడం లేదు. కానీ ఆ సమయంలో రూప్ సిస్టం చాలా కఠినంగా ఉండేది. చాలా నొప్పి వేసేది అని నితిన్ చెప్పుకొచ్చాడు. ఇకపోతే తాజాగా నితిన్ "రాబిన్ హుడ్" అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ ని మార్చి 28 వ తేదీన విడుదల చేయనున్నారు. శ్రీ లీల ఈ మూవీ లో హీరోయిన్గా నటించగా ... వెంకీ కుడుముల ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. మైత్రి సంస్థ వారు ఈ మూవీ ని నిర్మించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: