టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఇప్పటివరకు ఎన్నో అద్భుతమైన విజయవంతమైన సినిమాలలో హీరోగా నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక సూపర్ సాలిడ్ క్రేజ్ ను ఏర్పరచుకున్నాడు. ఇకపోతే పవన్ కళ్యాణ్ కొన్ని సంవత్సరాల క్రితం పంజా అనే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా 2011 వ సంవత్సరం భారీ అంచనాల నడుమ విడుదల అయింది. కానీ ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంలో మాత్రం సక్సెస్ కాలేకపోయింది.

మూవీ కి తమిళ దర్శకుడు అయినటువంటి విష్ణు వర్ధన్ దర్శకత్వం వహించగా ... యువన్ శంకర్ రాజా ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ లో సారా జేన్ డయాస్ అనే బ్యూటీ హీరోయిన్గా నటించింది. అలాగే ఆమెతో పాటు అంజలి లావానియా అనే మరో అమ్మాయి కూడా హీరోయిన్గా నటించింది. ఇక ఈ మూవీ లో అంజలి లావానియా తన నటనతో , అందాలతో ప్రేక్షకులను కట్టి పడేసింది. దానితో పంజా మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద విజయం సాధించకపోయినా ఈ మూవీ ద్వారా ఈమెకు మాత్రం మంచి గుర్తింపు వచ్చింది. ఇకపోతే ఈ సినిమాలో ఈమె తన అందాలతో , నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ మూవీ తర్వాత ఈమెకు తెలుగులో వరుస పెట్టి సినిమా అవకాశాలు వస్తాయి అని చాలా మంది అనుకున్నారు.

కానీ ఆ విధంగా ఈమెకు తెలుగులో పంజా మూవీ తర్వాత పెద్దగా అవకాశాలు రాలేదు. దానితో ఈమె ఆ తర్వాత కొంత కాలానికే తెలుగు సినీ పరిశ్రమకు దూరం అయింది. ఇకపోతే పంజా సినిమాలో తన అందాలతో ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ బ్యూటీ పంజా సినిమా విడుదల అయ్యి చాలా సంవత్సరాలే అవుతున్న ఇప్పటికీ అదే స్థాయి అందాలను మెయింటైన్ చేస్తూ వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: