నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రస్తుతం అఖండ 2 చిత్రంలో బిజీగా ఉన్నారు. డైరెక్టర్ బోయపాటి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉండడంతో మరింత క్రేజ్ పెరగడమే కాకుండా బడ్జెట్ కూడా భారీగానే పెరిగినట్లు టాక్ వినిపిస్తోంది. వరుస హిట్లతో దూసుకుపోతున్న బాలయ్య కలెక్షన్స్ విషయం పడితే భారీ సక్సెస్ రేట్ ని అందుకున్నారు. అందుకే అఖండ 2 విషయంలో చిత్ర బృందం ఏ మాత్రం వెనకడుగు వేయకుండా భారీ బడ్జెట్ ని పెట్టడానికి సిద్ధమవుతున్నారు. బోయపాటి, బాలయ్య కాంబినేషన్ అంటే హిట్ కాంబినేషన్ అనే ముద్ర పడిపోయింది.


వీరి కాంబినేషన్లో ఇప్పటివరకు వచ్చిన మూడు సినిమాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. ఈ నేపథ్యంలోనే అఖండ 2 సినిమా పైన భారీ అంచనాలు ఏర్పడగా ఈ సినిమా గురించి ఇప్పటికీ ఏవో ఒక రూమర్స్ వినిపిస్తూ ఉంటాయి. ఏదో ఒక సన్నివేశానికి సంబంధించి లీక్ ఇస్తూనే చిత్ర బృందం భారీ హైట్ తీసుకువస్తోంది. ఒకసారి కుంభమేళాలలో ,మరొకసారి హిమాలయాలలో ,మరొకసారి ఆంధ్రప్రదేశ్లో పలు ప్రాంతాలను సినిమా షూటింగ్ చేస్తూ భారీగా హైప్ పెంచేశారు. ఈ చిత్రాన్ని 14 రిలీస్ బ్యానర్ పైన నిర్మిస్తూ ఉన్నారు సుమారుగా ఈ సినిమాకి 150 కోట్ల బడ్జెట్ తో నిర్మించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


అయితే ఇప్పుడు 150 కోట్లను మించి మరి 175 కోట్లనుంచి 200 కోట్ల వరకు బడ్జెట్ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సినీవర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందులో జగపతిబాబు, ఎస్ జె సూర్య వంటి వారు నటిస్తూ ఉండగా.. సంయుక్తా మీనన్ కూడా నటిస్తూ ఉన్నది. కీలకమైన పాత్రలో కావ్య థాపర్ కూడా నటిస్తున్నట్లు సమాచారం. మరి ఈ సినిమా సక్సెస్ కావాలి అంటే 250 కోట్ల రూపాయల వరకు కలెక్షన్స్ రాబట్టాల్సి ఉన్నది. మరి బాలయ్య కెరియర్ లోనే చాలా రిస్క్ అయిన సినిమాలు ఆఖండ 2 కనిపిస్తోంది. మరి ఏ మేరకు వీటన్నిటిని దాటేస్తారో చూడాలి బాలయ్య.

మరింత సమాచారం తెలుసుకోండి: