మరికొన్ని రోజుల్లో విడుదల కానున్న రాబిన్ హుడ్ సినిమాపై ఒకింత భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. నితిన్ వెంకీ కుడుముల కాంబినేషన్ లో భీష్మ తర్వాత తెరకెక్కుతున్న సినిమా కావడం ఈ సినిమాపై అంచనాలు పెరగడానికి కారణమైంది. ఈ సినిమాలో కేతిక శర్మ స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. అది దా సర్ప్రైజ్ అంటూ ఆమె నిజంగానే ప్రేక్షకులను సర్ప్రైజ్ చేసింది.
 
అయితే పుష్ప1 మూవీలో ఐటమ్ సాంగ్ ను కేతిక శర్మ మిస్ చేసుకుందంటూ షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. పుష్ప నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించగా ఆ విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. అది దా సర్ప్రైజ్ సాంగ్ తో కేతిక శర్మ రాబిన్ హుడ్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారని రవిశంకర్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
 
పుష్ప సినిమాలో సమంత కంటే ముందు కేతిక శర్మను కలవాలని అనుకున్నామని రవిశంకర్ వెల్లడించారు. అప్పుడు మిస్ అయ్యామని మళ్లీ ఇన్నేళ్లకు ఆమెతో వర్క్ చేసే అవకాశం దక్కిందని రవిశంకర్ అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం. రాబిన్ హుడ్ సినిమాలో కేతిక శర్మ పాట ఉన్నందుకు చాలా సంతోషంగా ఉందని శ్రీలీల బిజీగా ఉండి కూడా డేట్స్ సర్దుబాటు చేసుకుని ఈ సినిమాలో నటించారని రవిశంకర్ తెలిపారు.
 
రాబిన్ హుడ్ సినిమాలో మొదట రష్మికను హీరోయిన్ గా ఎంపిక చేశామని అయితే డేట్స్ సమస్య వల్ల రష్మికసినిమా నటించలేకపోయిందని వెంకీ కుడుముల వెల్లడించారు. రాబిన్ హుడ్ సినిమాకు ఒకింత భారీ స్థాయిలోనే బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. రాబిన్ హుడ్ సినిమా ఏ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తుందేమో చూడాల్సి ఉంది. నితిన్ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ పెరుగుతున్నాయి. కేతిక శర్మ పుష్పలో ఐటమ్ సాంగ్ చేసి ఉంటే ఆమె కెరీర్ పుంజుకునే ఛాన్స్ అయితే ఉండేది.




మరింత సమాచారం తెలుసుకోండి: