
పెళ్లికి ముందు పెళ్లి తర్వాత నయనతార ఎంతలా మారిపోయింది అనేది మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అది అందరికీ తెలిసిందే . మరీ ముఖ్యంగా హీరోయిన్ నయనతార పెళ్లి తర్వాత భర్త విగ్నేశ్ శివన్ తో కలిసి ప్రముఖ దేవాలయాలను సందర్శించడమే కాకుండా ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తూ వచ్చారు. కాగా ఇప్పుడు భర్తతో ఆమే ఇంట్లో ప్రత్యేక పూజలు చేయిస్తున్నారట . అంతేకాదు హోమం కూడా వేసి పండితులతో నిష్టగా పూజలు నిర్వహిస్తున్నారట. రీజన్ ఏంటో తెలియదు కానీ నయనతార ఇలా ఈ విధంగా ఇంట్లోనే పూజలు పెట్టడం ఇదే ఫస్ట్ టైం అంటున్నారు అభిమానులు .
అయితే ఆమె పేరు పై మధ్యకాలంలో ఎటువంటి ట్రోలింగ్ జరిగింది అనేది అందరికి తెలుసు. ఆమె ఎంత ఇబ్బందులు ఎదుర్కొంది అనేది అందరికీ తెలిసిందే . పూర్తిగా నెగిటివిటీ పోయి పాజిటివిటీగా మారాలి అన్న ఉద్దేశంతోనే ఆమె ఈ విధంగా చేసి ఉంటుంది అంటున్నారు జనాలు . మరి కొందరు ఏమో త్వరలోనే గుడ్ న్యూస్ చెప్తుందేమో అందుకే ఇలా దేవుడు ఆశీర్వాదాలు తీసుకుంటుందేమో అంటూ ఆమె నుంచి మరొక గుడ్ న్యూస్ ఎక్స్పెక్ట్ చేసే విధంగా మాట్లాడుతున్నారు . సోషల్ మీడియాలో ప్రెసెంట్ హీరోయిన్ నయనతార - విగ్నేశ్ శివన్ ల పేర్లు బాగా ట్రెండ్ అవుతున్నాయి..!