హీరో నితిన్ ,శ్రీలీల కాంబినేషన్లో వస్తున్న చిత్రం రాబిన్ హుడ్.. డైరెక్టర్ వెంకీ కుడుముల ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా నిన్నటి రోజున ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో చాలా గ్రాండ్గా జరిగింది. ఇందుకు గెస్ట్ గా ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరుకాగా డేవిడ్ వార్నర్ ని ఉద్దేశిస్తూ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ పలు వ్యాఖ్యలు చేయడం జరిగింది.. స్టేజ్ పైనే డేవిడ్ వార్నర్ ను తిట్టేయడంతో అందరూ ఆశ్చర్యపోయారు.


డేవిడ్ వార్నర్ ను రేయ్ నువ్వు పెద్ద దొంగ మామూలోడివి కాదు వీడు అంటూ వ్యాఖ్యానించడం జరిగింది.. అయితే ఇది రాజేంద్రప్రసాద్ సరదాగానే మాట్లాడినప్పటికీ.. డేవిడ్ వార్నర్ అభిమానులను తీవ్ర ఆగ్రహానికి గురై ఎలా చేసిందట.. మా వెంకీ, నితిన్ కలిసి డేవిడ్ వార్నర్ ని తీసుకువచ్చారు.. ఆయన క్రికెట్ ఆడువయ్యా అంటే పుష్ప స్టెప్పులు వేస్తున్నారు వీడు మామూలోడు కాదు పెద్ద దొంగ అంటూ వార్నర్ ని అనడం జరిగింది రాజేంద్రప్రసాద్.. అయితే ఇది సరదాగా మాట్లాడినప్పటికీ వార్నర్ అభిమానులను తీవ్ర ఆగ్రహానికి గురయ్యేలా చేసింది.


అలాగే రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ 48 ఏళ్లుగా తాను సినీ ఇండస్ట్రీలో ఉన్నానని.. ఇలా ఉండడానికి ముఖ్య కారణం మైత్రి మూవీస్ కారణమని ఇది తన సొంత కంపెనీ లాగా ఉన్నదని.. తాను ఫస్ట్ శ్రీమంతుడు సినిమాలో నటించాను ఇవాళ రాబిన్ హుడ్ చిత్రంలో కూడా నటించాను ఇలా మీ అందరి ముందు నిలబడే మాట్లాడే అర్హత తనకు ఉన్నదని ఈ సినిమా చూసిన తర్వాత మీకు అర్థమవుతుందంటూ వెల్లడించారు ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా ఉంటుందని తెలియజేశారు రాజేంద్రప్రసాద్. మళ్లీ చాలాకాలం తర్వాత ఒక కామెడీ సినిమాతో మీ ముందుకు రాబోతున్నాము ఈ సినిమా క్రెడిట్ అంతా కూడా వెంకీ కుడుములదే అంటూ తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: