
ఈ సినిమా పూర్తిగా స్పోర్ట్స్ నేపథ్యంలోనే తెరకెక్కబోతుంది. నిజానికి రామ్ చరణ్ కి స్పోర్ట్స్ అంటే చాలా చాలా ఇష్టం . కానీ ఇప్పటివరకు తన సినిమాలలో ఎక్కడా కూడా స్పోర్ట్స్ ఆడిన సందర్భాలు లేవు. డైరెక్టర్స్ ఎందుకు చరణ్ ని స్పోర్ట్స్ ఆడే విధంగా చూపించలేదు. కనీసం కామెడీ సీన్స్ పరంగా కూడా అలాంటి డేరింగ్ స్టెప్ తీసుకోలేదు . కానీ బుచ్చిబాబు సనా ఏకంగా ఫుల్ కాన్సెప్ట్ స్పోర్ట్స్ నేపథ్యంలో తీసుకొని ఆయనతో సినిమాని తెరకెక్కిస్తున్నారు . ఇది నిజంగా బిగ్ బిగ్ సాహసం అని చెప్పాలి .
ఒక పాన్ ఇండియా స్టార్ పూర్తిగా స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కే సినిమాలో నటించడానికి ఓకే చేయడం అనేది కొంచెం టఫ్ మ్యాటరే . కానీ ఫ్యాన్స్ పై ఉన్న నమ్మకంతో కథపై ఉన్న ధీమాతో రామ్ చరణ్ ఈ విధంగా డెసిషన్ తీసుకున్నారు అంటున్నారు సినీ ప్రముఖులు . సోషల్ మీడియాలో ఇప్పుడు బుచ్చిబాబు సన దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన సినిమా గురించి వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి . ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వి కపూర్ కనిపిస్తుంది . అంతేకాదు ఈ సినిమాలో రామ్ చరణ్ క్యారెక్టర్ మొత్తం ఇప్పటివరకు ఆయన లైఫ్ లో నటించిన అన్ని సినిమాలలోకి చాలా చాలా డిఫరెంట్ గా ఉండబోతుందట. అందుకే ఈ సినిమాని ఎప్పుడెప్పుడు చూద్దామా అంటూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు రామ్ చరణ్ ఫ్యాన్స్..!