రష్మిక మందన్నా.. టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది స్టార్ హీరోయిన్ . ఆ మాటకొస్తే టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ ఇండస్ట్రీలో కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా నెంబర్ వన్ హీరోయిన్ అని చెప్పాలి . చాలా తక్కువ టైంలోనే స్టార్ స్టేటస్ అందుకుంది . మరీ ముఖ్యంగా బడా బడా స్టార్స్ సినిమాలో నటించి ఆ హీరోలకి మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకుని ఇప్పుడు ఇండస్ట్రీలో రాజ్యమేలేస్తుంది . బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారిపోయింది రష్మిక మందన్నా. ఆ విషయం అందరికీ తెలిసిందే . త్వరలో రిలీజ్ కాబోతున్న "సికిందర్" సినిమాపై ఆమె హ్యూజ్ ఆశలు పెట్టుకొని ఉంది. 


ఈ సినిమాతో మరొక హిట్ తన ఖాతాలో వేసుకోవడానికి సిద్ధంగా ఉంది రష్మిక అంటూ బాలీవుడ్ ఇండస్ట్రీలో జనాలు మాట్లాడుకుంటున్నారు . అయితే అందరూ కూడా రష్మిక మందన్నా గురించి ఏవైతే అనుకున్నారో అదే నిజం కాబోతోంది. రష్మిక కొన్ని హిట్ సినిమాలు చేసింది.  తన ఖాతాలో హిట్స్ వేసుకుంది . కానీ ఖచ్చితంగా ఆ తర్వాత అలాంటి హిట్ సినిమాలు తన ఖాతాలో వేసుకుంటుంది అని చెప్పలేం.  ఒకే జోనర్లో ఆమె సినిమాలను చేసుకుంటూ పోతే ఆమెకు ఆఫర్లు తగ్గిపోతాయి అని అంతా అనుకున్నారు .



నిజంగానే అలాగే జరిగింది.  బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు రష్మికకు ఒకే టైప్ ఆఫ్ కంటెంట్ ఉన్న సినిమాలలో ఆఫర్స్ వస్తున్నాయట . మరి ముఖ్యంగా ప్రతి సినిమాలోనూ ఆమె ఒకే స్టైల్ చూపిస్తూ ఉండడంతో కొంతమంది రష్మికను కాకుండా వేరే హీరోయిన్స్ ను కూడా చూస్  చేసుకుంటున్నారట . ఎక్కువ ఫెమ్ ఉన్నా కూడా హై రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తూ ఉంటారు అని మేకర్స్ కి తెలుసు . ఆ కారణంగానే రష్మికను కొన్ని సినిమాలలో అసలు ఆఫర్ అడక్కుండానే వేరే హీరోయిన్స్ తో ఓకే చేసేస్తున్నారట . మొత్తానికి అన్ని సినిమాలు హిట్ అవుతున్న ఆ ఫేమే పెద్ద తలనొప్పిగా మారిపోయింది . మొదటి నుంచి ఫ్యాన్స్ అనుకుంటూనే ఉన్నారు . ఎంత పైకి ఎదుగుతారో అంత పాతాళానికి పడిపోతారు అని.  అనుకున్నట్టే జరుగుతుంది అంటూ మాట్లాడుకుంటున్నారు ఫ్యాన్స్..!

మరింత సమాచారం తెలుసుకోండి: