ఇక చిత్ర పరిశ్ర‌మ‌లో ఉన్న స్టార్ సెలబ్రిటీ వారసులు తమ కుటుంబ లెగిసిని ముందుకు తీసుకెళ్లే సమయంలో తాతలు , తండ్రుల బ్లాక్ బస్టర్ సినిమాలను రీమేక్ చేయాలని అభిమానులు కోరుకుంటూ ఉంటారు. కానీ ఇది అంత ఈజీ కాదు .. అందుకే రామ్ చరణ్ , మహేష్ బాబు , ప్రభాస్ , నాగచైతన్య వీళ్ళు ఎవరు వీటి జోలికి వెళ్ళకుండా కొత్త కథలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు .. అయితే సీనియర్ హీరోల్లో నాగార్జున తండ్రి ఏఎన్నార్ ఎవర్గ్రీన్ క్లాసిక్ దేవదాసుని స్ఫూర్తిగా తీసుకుని మజ్ను సినిమాను ట్రై చేశారు కానీ ఆ తర్వాత మళ్లీ అలాంటి ప్రయత్నాలు చేయలేదు . అయితే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఏమైనా తాత సూపర్ హిట్ సినిమాలను రీమేక్ చేయాలని అభిమానులు ఇప్పటినుంచో కోరుకుంటున్నారు .. యమదొంగ తో కొంచెం ట్రై చేసిన అది పూర్తిగా వారి ఆకలి తీర్చలేదు .


ఎన్టీఆర్ సైతం  ఈ రీమేక్లపై ఎంతో సానుకూలంగానే ఉన్నాడు కానీ అలా అని తొందరపడి ఉద్దేశం ఆయనలో లేదు .. తాత నందమూరి తారకరామారావు కెరియర్లో తిరుగులేని ముద్రవేసిన పౌరాణిక , ఇతిహాస గాథలు చేయాలని తనకు ఉందని కాకపోతే సరైన దర్శకుడు అవకాశం దొరికితే త‌ప్ప‌ చేయనని రీసెంట్ గా చెప్పినట్లు వచ్చిన వార్త సినీప్రియలను ఎంతగానో ఆలోచనలో పడేసింది .. అయితే గతంలో బాహుబలి టైంలో రాజమౌళి కూడా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దానవీరశూరకర్ణ లాంటి గొప్ప సినిమాను జూనియర్ ఎన్టీఆర్ తో తీయాలనే కోరికను ఆయన బయటపెట్టాడు .. అయితే ఆ ముచ్చట యమదొంగతో కొంత తీర్చుకున్న అది రీమేక్ కిందుకు రాదు కాబట్టి అది సరిపోదు .


అయితే ఇప్పుడు నిజంగా జూనియర్ ఎన్టీఆర్ కనుక అలా ఎంచుకోవాల్సి వస్తే ఆయ‌న‌ నటనకు చాలెంజ్ విసిరే  సర్దార్ పాపారాయుడు , శ్రీకృష్ణ పాండవీయం , పాండవ వనవాసం , జస్టిస్ చౌదరి , బందిపోటు, అగ్గిపిడుగు, గుండమ్మ కథ, నర్తనశాల లాంటి సినిమాలు ట్రై చేయవచ్చు .. ప్రస్తుతం విస్తృతమైన టెక్నాలజీ అందుబాటులో ఉంది వందల కోట్ల బడ్జెట్ పెట్టేందుకు నిర్మాతలు రెడీగా ఉన్నారు .. కాకపోతే ఎంపిక చేసుకోవటంలో జాగ్రత్తగా ఉండాలి .  పాండురంగ మహత్యం , లవకుశని శ్రీరామరాజ్యంగా రీమేక్ చేసిన బాలకృష్ణ కొంత ప్రశంసలు అందుకున్నారు కానీ మంచి ఫలితాలు అందుకోలేకపోయారు .. అయితే ఇప్పుడు బాబాయ్ లాగా జరగకూడదు అనుకుంటే అబ్బాయి సెలక్షన్ ఎంతో కేర్ ఫుల్ గా తీసుకుని ముందుకు వెళ్లాలి ..

మరింత సమాచారం తెలుసుకోండి: