దాదాపు రెండు సంవత్సరాల క్రితం మ్యాడ్ అనే మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్లను వసూలు చేసి సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ మంచి విజయాన్ని సాధించిన తర్వాత కొంత కాలానికే ఈ మూవీ కి కొనసాగింపుగా మ్యాడ్ స్క్వేర్ అనే మూవీ ని రూపొందించబోతున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది.

ఇకపోతే కొంతకాలం క్రితమే మ్యాడ్ స్క్వేర్ సినిమా యొక్క షూటింగ్ ను మేకర్స్ ప్రారంభించారు. ఈ మూవీ షూటింగ్ను చాలా త్వరగా కంప్లీట్ చేశారు. మార్చి 28వ తేదీన మ్యాడ్ స్క్వేర్ మూవీ ని ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ నుండి మేకర్స్ కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా వాటికి అద్భుతమైన రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన టికెట్ బుకింగ్స్ ను కూడా ఓపెన్ చేశారు. ఈ సినిమాకు యూ ఎస్ ఏ లో ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ మూవీ బృందం వారు ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ఆ పోస్టర్ ప్రకారం యూ ఎస్ ఏ లో ప్రీమియర్ ప్రీ సేల్స్ తోనే ఈ మూవీ కి 100 కే ప్లస్ కలెక్షన్స్ వచ్చినట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇకపోతే మ్యాడ్ మూవీ మంచి విజయం సాధించడంతో ఆ మూవీ కి కొనసాగింపుగా రూపొందిన సినిమా కావడంతో మ్యాడ్ స్క్వేర్ మూవీ పై ప్రస్తుతం ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

మరి ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: