టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న నటులలో అల్లరి నరేష్ ఒకరు. ఈయన రవి బాబు దర్శకత్వంలో రూపొందిన అల్లరి అనే మూవీ తో హీరో గా కెరియర్ను మొదలు పెట్టాడు. ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సురేష్ బాబు నిర్మించాడు. ఇకపోతే తాజాగా అల్లరి నరేష్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఆ ఇంటర్వ్యూలో భాగంగా అల్లరి సినిమా సమయంలో జరిగిన ఒక ఆసక్తికరమైన విషయం గురించి నరేష్ చెప్పుకొచ్చాడు.

తాజా ఇంటర్వ్యూలో భాగంగా అల్లరి నరేష్ మాట్లాడుతూ ... నా మొదటి సినిమా అల్లరి. ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తి అయింది. విడుదల తేదీ దగ్గరకు వచ్చింది. ఒక రోజు నేను ఆ మూవీ దర్శకుడు అయినటువంటి రవి బాబుతో మాట్లాడుతున్నాను. ఇక ఆయన ఆ సమయంలో సినిమా విడుదల తేదీ దగ్గరకు వచ్చింది ... నీ పాత్రకు డబ్బింగ్ చెప్పుకున్నావా అని నన్ను అడిగాడు. నేను లేదు అని చెప్పాను. దానితో ఆయన తొందరగా చెప్పు అని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నేను వెంటనే వెళ్లి రాత్రి 11 గంటలకు ఆ సినిమా డబ్బింగ్ చెప్పడం మొదలు పెట్టాను. అలా కంటిన్యూగా చెబుతూ వచ్చాను. ఉదయం 5 గంటల వరకు ఆ సినిమాకు సంబంధించిన నా పాత్రకు నేను డబ్బింగ్ మొత్తం కంప్లీట్ చేశాను. ఆ తర్వాత డబ్బింగ్ థియేటర్ ముందు నిల్చని ఉన్నారు.

ఉదయం సురేష్ బాబు గారికి జాగింగ్ చేయడం అలవాటు. ఆయన జాగింగ్ చేస్తూ డబ్బింగ్ థియేటర్ దగ్గరికి వచ్చాడు. నన్ను చూసి ఇక్కడ ఏం చేస్తున్నావ్ అని అడిగాడు. దానితో నేను డబ్బింగ్ చెప్పాను ... సార్ అన్నాను. ఆయన లోపలికి వెళ్లి నేను చెప్పిన డబ్బింగ్ మొత్తం చూసి ఇంత త్వరగా ఎలా చెప్పావు అని షాక్ అయ్యాడు. అలాగే అద్భుతంగా చెప్పావు అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయాడు అని అల్లరి నరేష్ తాజా ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: