ఈ మధ్యకాలంలో నటీనటులకు ఏమైందో ఏమో తెలియదు కానీ చిన్న చిన్న మనస్పర్దలకే విడాకులు తీసుకునేంత పెద్ద ఆలోచనలు చేస్తున్నారు.. పిల్లలు పుట్టి పెళ్ళీడుకి వచ్చినా సరే తల్లిదండ్రులు విడాకులు తీసుకొని అందరికీ షాక్ ఇస్తున్నారు. అయితే తాజాగా ఓ టాలీవుడ్ హీరోయిన్ విడాకులు తీసుకోబోతుంది అంటూ సోషల్ మీడియాలో ఒక రూమర్ వినిపిస్తోంది. మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరయ్యా అంటే..టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్..అయితే ఈమె పేరు వినడంతోనే అందరు షాక్ అయిపోతారు. కాజల్ అగర్వాల్ కి ఏమైంది..ఆమె ఎందుకు విడాకులు తీసుకుంటుంది అని చాలామంది అయోమయంలో పడిపోతారు. అయితే కాజల్ అగర్వాల్ 2020లో రహస్యంగా గౌతమ్ కిచ్లూని ప్రేమించి పెళ్లి చేసుకుంది. 

ఇక గౌతమ్ కిచ్లు కాజల్ అగర్వాల్ చిన్ననాటి స్నేహితుడు.. ఆమె తన స్నేహితుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది.వీరికి ఒక బాబు కూడా పుట్టారు. ఇక పెళ్లై బాబు పుట్టాక కూడా సినిమాల విషయంలో తగ్గేదేలే అన్నట్లు కాజల్ అగర్వాల్. వరుస సినిమాల్లో ఆఫర్స్ అందుకుంటూ సినిమాలు చేస్తూ పోతుంది.అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ పై తాజాగా కాజల్ అగర్వాల్ విడాకుల  రూమర్లు వినిపిస్తున్నాయి. దానికి ప్రధాన కారణం ఈ మధ్యకాలంలో కాజల్ అగర్వాల్ ఒంటరిగా వెకేషన్ కి వెళ్లడంతో కాజల్ భర్తతో దూరంగా ఉంటుందని విడాకులు తీసుకోబోతుందని,అందుకే భర్తతో దూరంగా దూరంగా ఉంటుంది అనే ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతుంది.

అంతేకాకుండా రీసెంట్ గా ఓ ట్రిప్ కి వెళ్ళిన సమయంలో కాజల్ తన భర్తతో కాకుండా కేవలం తన కొడుకుతో మాత్రమే వెళ్లిందని అలాగే బయట ఎక్కడ కూడా భర్త తో కలిసి కనిపించడం లేదని,ఇద్దరు మధ్య అండర్స్టాండింగ్ మిస్ అవ్వడంతో కాజల్ అగర్వాల్ తన కొడుకుని తీసుకొని భర్తకు దూరంగా వచ్చేసినట్టు కాజల్ అగర్వాల్ వ్యక్తిగత జీవితం గురించి టాలీవుడ్ ఇన్సైడ్ వర్గాల్లో పలు రూమర్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదు అని ఇదంతా సోషల్ మీడియాలో కొంతమంది ఆకతాయిలు సృష్టించే పుకార్లేనని కాజల్ అగర్వాల్ సన్నిహితులు అంటున్నారు. మరి కాజల్ అగర్వాల్ విడాకుల వార్తలు నిజమేనే లేక రూమర్ల అనేది క్లారిటీ రావాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: