సోషల్ మీడియాలో ఏ విషయమైనా సరే ఇట్టే ట్రెండ్ అయిపోతూ ఉంటుంది.  సెకండ్స్ లోనే ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయిపోతూ ఉంటుంది . మరీ ముఖ్యంగా స్టార్ సెలబ్రెటీస్ తమ లైఫ్ లో జరిగే విషయాల గురించి తాము పోస్ట్ చేసే ఫొటోస్ గురించి ఒకటికి పది సార్లు ఆలోచించిన తప్పులేదు. ఆ ఏముందిలే జనరల్ ఫోటోనే కదా అని పోస్ట్ చేసేస్తే మాత్రం అది పెద్ద తలనొప్పులుగా మారే ఛాన్స్ ఉంది . ఇప్పుడు ప్రశాంత్ నీల్ భార్య చేసిన పని ఎన్టీఆర్ కి కొత్త హెడేక్ తెచ్చి పెట్టింది. మేటర్ ఏంటంటే ..


మనకు తెలిసిందే ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ మంచి ఫ్రెండ్స్ . జాన్ జిగిడి దోస్తులు అని చెప్పాలి . రాజమౌళి తర్వాత జూనియర్ ఎన్టీఆర్ అంత క్లోజ్ గా ఉండే డైరెక్టర్ కేవలం ప్రశాంత్ నీల్ అనే చెప్పాలి . వీళ్ళ కాంపోలో ఓ సినిమా రాబోతుంది . ఆల్రెడీ ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలన్నీ కూడా ఫినిష్ అయిపోయాయి. అయితే ఇప్పుడు ప్రశాంత్ నీల్ జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. ప్రశాంత్ నీల్ భార్య ఈ ఫోటోని షేర్ చేయడం గమనార్హం.



ఎన్టీఆర్ - ప్రశాంత్ నీ చిల్ అవుట్ అవుతున్న మూమెంట్ లో దిగిన పిక్చర్ గా ఇది తెలుస్తుంది . అయితే ఈ ఫోటోని ఇంకొంచెం జూమ్ చేసి బాగా గమనిస్తే ఒక గ్లాస్ అందులో మందు .. పక్కనే సిగరెట్ బాక్స్ ఉంది . దీంతో ఈ ఫోటో బాగా వైరల్ గా మారిపోయింది . ఇంతకు ముందు కొడుతుంది జూనియర్ ఎన్టీఆర్ నా..? ప్రశాంత్ నీల్ నా..? సిగరెట్ తాగే హ్యాబిట్ ఎవరికి ఉంది..? ఇద్దరు పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ సంపాదించుకున్న స్టార్స్ . మరి మందు ఆరోగ్యానికి హానికరం.. సిగరెట్ వల్ల ఎన్నో ప్రాణాంతకమైన జబ్బులు వస్తాయి అని తెలియదా..? ఆ మాత్రం సెన్స్ లేదా..? అంటూ ఓ రేంజ్ లో కామెంట్స్ చేస్తున్నారు . అసలు ప్రశాంత్ నీల్ భార్య ఈ ఫోటో షేర్ చేయకపోతే ఈ తలనొప్పులే లేవుగా అంటూ నందమూరి ఫ్యాన్స్ కూడా ఆమెపై మండిపడుతున్నారు.  ఒకే ఒక్క ఫోటోతో పాన్ ఇండియా లెవల్ లో సంపాదించుకున్న క్రేజ్ మొత్తం తుస్సు మంటూ కారిపోయే పరిస్థితి వచ్చింది. దీనిపై ఇద్దరూ ఎలా రియాక్ట్ అవుతారు అనేది బిగ్ క్వశ్చన్ మార్క్ గా ఉంది..!





మరింత సమాచారం తెలుసుకోండి: