
ఈ బ్లాక్ బాస్టర్ ను కాపాడుకోవాలంటే మంచి కాంబినేషన్ తో సినిమా చేయాలని ఈ సీనియర్ హీరో ఫిక్స్ అయ్యాడు .. ఈ క్రమంలోని నీ కథ బాగా నచ్చింది వేరే దర్శకుడు తో చేయడానికి కుదురుతుందా అని అడిగితే నందు దానికి నో చెప్పాడని కూడా తెలుస్తుంది .. ఇక దాంతో వెంకీ నందుల సినిమా అక్కడి తో ఆగిపోయింది .. అయితే ఇప్పుడు రచయిత నందు అక్కినేని హీరో అఖిల్ కి రీసెంట్గా ఒక కథ చెప్పినట్టు ఓ వార్త బయటికి వచ్చింది .. అఖిల్ కూడా ఈ సినిమా చేయడాని కి ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు టాలీవుడ్ ఇన్సైడ్ టాక్ ..
అయితే వెంకటేష్ కి చెప్పిన కథ ఇది కాదట .. అది వేరు ఇది వేరు .. ప్రస్తుతం అఖిల్ లెనిన్ అనే ఓ సినిమా చేస్తున్నాడు .. వినరో భాగ్యము విష్ణు కథ ఫేమ్ మురళీ కిషోర్ అబ్బూరు దర్శకుడు .. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఎంతో వేగంగా జరుగుతుంది .. ఈ సినిమా తర్వాత నందు సినిమా మొదలు పెట్లే అవకాశం ఉంది .. అయితే అఖిల్ , నందు సినిమాను శ్రీనివాస్ చిట్టూరి నిర్మాత గా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి .. ప్రస్తుతం నందు స్విఫ్ట్ పనులు మొదలు పెట్టినట్టు తెలుస్తుంది .. ఈ ప్రాజెక్టు కు సంబంధించిన పూర్తి వివరాలు కూడా త్వరలో నే బయటకు రానున్నాయి .